రాష్ట్ర ప్రజలకు ఇవాళ సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
దృశ్యం 1 :
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా.. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రైతు వ్యతిరేకి అన్న ముద్రను శాశ్వతంగా చెరిపేసుకోవాలన్నది చంద్రబాబు అంతరంగంగా కనిపిస్తోంది. ఈ దీక్ష ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించాలని, రైతులకు భారీగా నష్టపరిహారం ఇప్పించాలన్నది చంద్రబాబు ఆలోచన.
దృశ్యం 2 :
తెలుగింటి సంప్రదాయం.. నారావారి ఇంట వెల్లివిరిసింది. నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమై వెళుతున్న భర్త చంద్రబాబుకు.. భువనేశ్వరీ దేవి, వీరతిలకం దిద్ది.. హారతులు పట్టి.. సాగనంపారు. మామయ్య బాటకు అవాంతరం ఎదురుకాకుండా.. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పక్కనే శుభశకునంలా నిలిచారు.
దృశ్యం 3 :
నవ్వడమే పాపం అన్నట్లుండే చంద్రబాబు... ఉదయం మనస్ఫూర్తిగా నవ్వారు. సతీమణి భువనేశ్వరి వీరతిలకం దిద్ది, హారతి పడుతున్న వేళ.. మదిలో మరి ఏమి మెదిలిందో కానీ.. తృప్తిగా నవ్వారు.
ఈ మూడు దృశ్యాలూ.. అన్ని తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. చంద్రబాబు ఇంట ఇవాళ పండిన ఫ్యామిలీ సెంటిమెంట్... వైఎస్సార్ బతికున్న రోజుల్లో ఆయనకు, విజయమ్మ హారతి పట్టిన దృశ్యాలను ప్రతివారికీ గుర్తుకు తెచ్చి ఉంటాయి. నారావారి ఇంట కొత్తగా కనిపించిన భువనేశ్వరి సెంటిమెంట్ చంద్రబాబుకు ఏమేరకు కలిసొస్తుందో.. చూడాలి మరి.
విజయ్ గారు,
ReplyDeleteఫోటోలు పోస్ట్ చేసినందుకు థ్యాంక్స్ . నోరు జారి "వ్యవసాయం దండగ" అన్న పాపానికి "రైతు వ్యతిరేకి" అన్న బరువు మోస్తూనే ఉన్నాడు చంద్రబాబు. కనీసం, ఈ సెంటిమెంట్ కలసివచ్చి, రైతులు బాబును ఆదరిస్తారేమో!
~శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com
ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన
ReplyDeleteనలుపు నలుపె కాని తెలుపు గాదు
చంద్రయ్య మారుట కూడా అంతే నిజం
విశ్వదాభిరామ వినురవేమ
చాణుక్య గారూ..
ReplyDeleteమీ పద్య మందారం భేషో.. కాకుంటే.. దీన్ని వేమన్నకి ఆపాదించకుండా, మీ పేరిటే రాసి ఉంటే బావుండేది. ఎందుకంటే.. భవిష్యత్తు తరాల వారు ఎవరైనా.. ఈకామెంట్ చూస్తే.. ఓహో వేమన్న గారు ఈ పద్యాన్ని ఈరకంగా కూడా రాశారు కామోసు అనుకునే ప్రమాదమో.. లేక ఇదే సరైన రూపమనో అనుకునే ఇబ్బంది ఉంది. అయినా.. మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు.
విజయ్