Wednesday, December 1, 2010

కన్నడ భాష ఎంతో సులువు..

దక్షిణాదిలో, తెలుగుతో పాటు.. కన్నడ, తమిళ, మలయాళ భాషలు ఉన్నాయి. తెలియని వాళ్లు తెలుగు తప్ప మిగిలిన భాషలు ఏమీ అర్థం కావని, నేర్చుకోవడం అసాధ్యమని అనుకుంటుంటారు. అయితే కొంత పరిశీలనగా చూస్తే.. మన తెలుగుకు పొరుగు భాషలకు చాలా దగ్గరి పోలిక కనిపిస్తుంది. దిగువన కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. తెలుగు పదాలు.. వాటి సమానార్థంలో.. తెలుగు లాగనే ఉండే కన్నడ పదాలు మీకు తెలుస్తాయి. వాటి ప్రయోగం కూడా మన తెలుగులో మాదిరిగానే ఉంటుంది. అంటే కాస్త మనసు పెడితే.. అందరూ కన్నడ భాషను అభ్యసించ వచ్చు. మన భాషల జాబితాలోకి మరో పేరు చేర్చుకోవచ్చు. కింద ఇచ్చిన పదాలను పరిశీలించండి.
కన్నడ తెలుగు అర్థం



అకస్మాత్‌(వాగి) అకస్మాత్తు(గా) : ఉన్నట్టుండి
ఆకస్మిక(వాగి) ఆకస్మికం(గా) ఉన్నట్టుండి
అకారణ(వాగి) అకారణం(గా) కారణం లేకుండా
అకృత్య అకృత్య(ము) చేయకూడని పని
అక్కర అక్కర ప్రేమ, ఉపయోగం



ఇక్కట్టు ఇక్కట్టు కష్టం, ఇబ్బంది
ఇగరు ఇగురు ఆవిరగు
ఇచ్ఛానుసార ఇచ్ఛారీతిగా ఇష్టానుసారంగా
ఇట్టిగె ఇటిక బంకమట్టితో చేసి కాల్చిన రాయి
ఇత్యాది ఇత్యాది మొదలైన



ఉల్లాస ఉల్లాసము సంతోషము, ప్రకాశము
ఉంగర ఉంగరం చేతి వేలి ఆభరణము, అంగుళీయకము
ఉగ్ర ఉగ్రం (తీవ్ర కోపం)
ఉచ్చరణె ఉచ్చారణ (పలుకు)
ఉజ్జ ఉజ్జా(యింపు) సుమారు, ఊహించు



రుజు రుజు (వు) సాక్ష్యము, దృష్టాంతము
రుణ రుణం అప్పు
రుచి రుచి చవి, ఇచ్చ,
రుషభ వృషభం ఎద్దు
రుద్రభూమి రుద్రభూమి శ్మశానం, వల్ల కాడు



ఎక్కరిసు వెక్కిరించు వికార చేష్టలు చేయు
ఎగరు ఎగురు ఎగురుట
ఎత్తగడె ఎత్తుగడ ఉపాయము, యత్నము
ఎమకె/ఎమికె ఎముక ఎముక, అస్థి
ఎసరు ఎసరు వంట కోసం కాగబెట్టిన నీరు



కింది వాక్యాన్ని చూడండి.. కన్నడ ఎంత సులువో అర్థమవుతుంది.
తెలుగులో : కాస్త మనసు పెట్టి ప్రయత్నిస్తే.. కన్నడ భాషను తెలుగంత సులువుగా నేర్చుకోవచ్చు.
కన్నడలో : స్వల్పష్టు మనసు మాడి ప్రయత్నిసిదరె, కన్నడ భాషన్ను తెలుగంతె సులభవాగి కలియబహుదు.

1 comment:

  1. Happy New year , P. Vijaya kumarjii!
    Nice to know new language, for us kannaDa.
    కన్నడ సామెతలు, జానపద కథలను పాఠకులకు పరిచయం చేస్తారా?

    ReplyDelete