
ఈ ఉదయం అయ్యప్ప వ్రతదీక్షా మాల ధరించాను. ఆనవాయితీ ప్రకారం.. ఆధ్యాత్మిక రచనలు చదువుదామని, ఇంట్లోని పుస్తకాలు చూస్తుంటే.. శ్రీమద్వాల్మీకి రామాయణంలోని అతి పవిత్రమైన సుందరకాండము కనిపించింది. చదువుతుంటే.. ఈ పవిత్ర ఘట్టం విశేషాలను, ఇందులో వచ్చే పాత్రలను బ్లాగు ద్వారా నలుగురితో పంచుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ఈ పోస్టు. ఇవాళ మొదటి సర్గము పూర్తి చేశాను ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటడం, దారిలో మైనాకుడి స్వాగతం, సురసను జయించడం, సింహికను హతమార్చడం ప్రధానంగా ఉన్నాయి. ఈ సర్గములో వచ్చిన పాత్రలు.. వాటి వివరాలు :
ఆంజనేయుడు :
అంజన కుమారుడు. అంజన వానర స్త్రీ. ఈమె కుంజరుడనే వానరుడి కుమార్తె. కేసరి అనే వానర యోధుడి భార్య. ప్రభాస తీర్థంలో మునులను బాధిస్తున్న శంఖశబలాలనే ఏనుగులను సంహరిస్తాడు. భరద్వాజుడు మెచ్చుకుని ఇతడికి కేసరి

సందర్భం : సుందరకాండ యావత్తూ ఆంజనేయుడి వీరోచిత సుందర విజయ గాథే.
విద్యాధరులు : ఉపదేవతలు. పూలమాలలు కట్టడం వీరి పని. సర్పయాగానికి ఇంద్రుడి వెంట వెళతారు.
సందర్భం : ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించేందుకు తన శరీరాన్ని పెంచుతున్న సందర్భంలో వీరి ప్రస్తావన వస్తుంది.

రెక్కలు తెగకుండానే మైనాకుడు సముద్రం గర్భంలో దాక్కుంటాడు. మైనాకుడు.. ఇష్టారీతిగా పైకి, కిందకి, పక్కలకు ఇలా ఎటు కావాలంటే అటు పెరిగిపోగల శక్తిమంతుడు.
సందర్భం : తన మీదుగా ఎగురుతున్న ఆంజనేయుడు.. కాసేపు విశ్రమించేందుకు వీలుగా, మైనాకుడిని పెరగమని సముద్రుడు కోరతాడు. తనను గర్భంలో ఉంచుకుని, ఇంద్రుడినుంచి కాపాడుతున్న, సాగరుడి సూచనను మైనాకుడు పాటిస్తాడు. ఆంజనేయుడు మైనాకుడిపై స్వల్వ వ్యవధి విశ్రమిస్తాడు. రాముడి పని మీద వెళుతున్న ఆంజనేయుడికి ఈరీతిగా సేవ చేసిన మైనాకుడికి ఇంద్రుడు అభయాన్నిస్తాడు.

సందర్భం : మైనాకుడి మీదనుంచి తిరిగి లంఘించిన ఆంజనేయుడి బలపరాక్రమాలను మళ్లీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో.... దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సురసాదేవిని పంపుతారు. ఆమె, అతి భయంకరమైన రూపంతో.. ఆంజనేయుడిని అడ్డగిస్తుంది. ముందుకు సాగాలంటే తన నోట్లోకి దూరి బయటకు వెళ్లాలని షరతు పెడుతుంది. ఆంజనేయుడు ఆమె నోట్లోకి ప్రవేశించి, తన దేహాన్ని అంతకంతకూ పెంచుతూ వెళతాడు. దానికి తగ్గట్లుగానే ఆమె కూడా తన నోటిని పెంచుతూ పోతుంటుంది. ఉన్నట్టుండి ఆంజనేయుడు సూక్ష్మరూపాన్ని ధరించి, ఒక్క ఉదుటన బయటకు వెళ్లిపోతాడు. ఆరకంగా దేవతల పరీక్షను సమర్థంగా ఎదుర్కొంటాడు.


సందర్భం : సముద్రంపై నుంచి ఎగురుతున్న ఆంజనేయుడిని చూసి.. సింహిక తనకు మహాజంతువు ఆహారంగా లభించిందని భావించి, ఆంజనేయుడి నీడను లాక్కొని వెళుతుంది. దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త తగ్గుతుంది. విషయాన్ని గమనించిన ఆంజనేయుడు తన శరీరాన్ని ఇంతలింతలుగా పెంచుతాడు. దానికి తగ్గట్లే నీడ కూడా పెరుగుతుంది. దాంతో, సింహిక కూడా నోటిని బాగా తెరవాల్సి వస్తుంది. ఆంజనేయుడు హఠాత్తుగా ఆమె నోట్లోకి ప్రవేశించి.. చీల్చి చెండాడుతాడు.
గమనిక : తెలుగు భాషలో తప్పొప్పుల పట్టికను www.journomucchatlu.blogspot.com లో నేరుగా చూడొచ్చు
స్వామి శరణం
ReplyDeleteమీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నందుకు చాలా సంతోషం.
స్వామి శరణం...
ReplyDeleteశంకరయ్య స్వామీ.. నేను 1992 నుంచి ఓ ఐదు సార్లు తప్ప ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుంటూ వస్తున్నా. గతంలో సిగరెట్లు, మద్యానికి బానిసగా ఉన్న నేను అయ్యప్ప దీక్ష ఫలితంగా.. ఆ అలవాట్ల నుంచి పూర్తిగా దూరమయ్యాను. అందుకే.. కళ్లకు కనిపిస్తాడా లేడా అన్నది పక్కన పెడితే.. నా జీవితంలో, దురలవాట్లను దూరం చేసిన కీలక శక్తిగా అయ్యప్పను మనసా వాచా త్రికరణశుద్ధితో పూజిస్తా.
మీరు నాకంటే సీనియర్ స్వాములన్నమాట! సంతోషం.
ReplyDeleteనేను 1994 నుండి మాలాధారణ చేస్తున్నాను. మధ్యలో రెండుసార్లు ఆటంకం వచ్చింది. గురుస్వామిగా పడిపూజలు చేయిస్తుంటాను. నేను రాసిన అయ్యప్ప పాటలు, అయ్యప్ప కథాగానం క్యాసెట్లుగా వచ్చాయి. పురాణోక్తంగా అయ్యప్ప పూజావిధానం పుస్తకంగా ప్రకటించాను.
ఈ సారి కొన్ని కారణాల వల్ల దీక్ష తీసికొనలేదు.
మీతో పరిచయం ఆనందాన్ని ఇచ్చింది.
స్వామి శరణం..
ReplyDeleteబ్లాగు ద్వారా మీ పరిచయం కలగడం నాకూ ఆనందంగా ఉంది.