కొన్నిసార్లు తెలియకుండా పేర్లను తప్పుగా రాస్తుంటాము. ఇట్లాంటి వాటిలో రమేష్... సురేష్.. దినేష్... మొదలైనవి కొన్ని. ఈ పేర్ల ఓనర్లు కూడా తాము సరైన రూపంలో రాస్తున్నామా లేదా అని ఆలోచించకుండా తప్పు రూపంలోపేర్లు రాసేస్తుంటారు. ఇంతకీ, రమేష్ అంటే తప్పేంటి..? ఓసారి చూద్దాం..
ఉదాహరణకు రమేష్ ని తీసుకుందాం. ఈ పదాన్ని విడదీస్తే..
రమ + ఈష్ = రమేష్.
రమ అంటే లక్ష్మీ దేవి,
ఈష్ లేదా ఈష అంటే నాగటి యేడికోల (నాగలి కోల) అని అర్థం
రమేష్‌కి పూర్తిగా అర్థం చెప్పాలంటే.. లక్ష్మీదేవి నాగలి కోల అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
లక్ష్మీదేవికి, నాగలి కోలకి ఏమిటి సంబంధం చెప్పండి...?
అందుకే.. ఈ పదాన్ని రమేశ్ అని రాయాలి.
రమ + ఈశు(డు) = రమేశుడు
రమ అంటే లక్ష్మీదేవి.
ఈశుడు అంటే శివుడు, భర్త, రాజు అని అర్థాలున్నాయి.
రమ+ఈశుడు = రమేశుడు... అంటే లక్ష్మీదేవి భర్త ... విష్ణువు అని అర్థం
అలాగే సురేశు (దేవతలకు రాజు), మహేశు (మహి(భూమికి) రాజు), దుర్గేశు (దుర్గకు భర్త), తదితర పదాలను ష్.. తో కాకుండా శ్ తో రాస్తేనే అర్థవంతంగా ఉంటాయి.
అక్షయ కుమార్ :
ఈ పేరు చూస్తే మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ... ఇంతకీ ఈ పేరు తొలి యజమాని ఎవరో తెలుసా..? లంకాధిపతి రావణుడి కుమారుడు ఈ పేరు తొలి యజమాని. భారత కథ ప్రకారం అక్షయకుమారుడు రావణాసురుడి కుమారుడు. లంకకు వచ్చిన హనుమంతుడిని బంధించేందుకు వెళ్లి, హనుమ చేతిలో మరణిస్తాడు. ఈ సందర్భంలో అక్షయకుమారుడి ప్రస్తావన వస్తుంది.
మరి మన బాలీవుడ్ అక్షయకుమార్‌కి ఈ కథ తెలిస్తే.. ఎలా పీలవుతాడో..!
సరదాగా గమనిస్తే ఇట్లాంటి గమ్మత్తులు పుష్కలంగా దొరుకుతాయి. తర్వాతి పోస్టులో మళ్లీ ఇట్లాంటి మరిన్ని పదాలు అర్థాలతో కలుద్దాం. బై బై
బై బై
రావణ పుత్రుడి పేరు అక్షకుమారుడు అనుకుంటా. ఈశుల గురించి మీ మాట సరైనదే. ఇలా ష్ష్ అని పేర్లు పెట్టుకునే పద్ధతిని శ్రీపాద సుబ్రహమణ్యశాస్త్రిగారు ఎప్పుడో 80 ఏళ్ళ కిందటే మహ చురుగ్గా విమర్శించారు, శుభికే శిర ఆరోహ అనే కథలో. కానీ ఏం చేస్తాం, జనాల పైత్యానికి బలం చాలా ఎక్కువ.
ReplyDeleteస్, శ్, ష్ అని మూడు పదాలు రాసుకుంటున్నాము. కాని మనకు ఉన్నవి రెండు శబ్దాలే. అవి s, sh. వివిధ ప్రాంతాలలో శ, ష లను ఒక్కోలాగా పలుకుతున్నారు. కొన్ని ప్రాంతాలలో శ ని స లాగా పలకడం కూడా ఉంది. అంతెందుకు? మీరే రమేష్, రమేశ్, రమేస్ లను పలుకుతూ రికార్డు చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది.
ReplyDeleteఅక్షయకుమారుడి కథ భారతంలో ఎక్కడ వస్తుంది?
ReplyDeleteడియర్ హరీ..
ReplyDeleteమీరు ఉచ్చారణ గురించి చెబుతున్నారు. నేను పదం అర్థవంతమైన రాత స్వరూపం గురించి చెప్పాను. తేడా గుర్తించ మనవి.