Thursday, November 25, 2010
సిఎం గారూ... ఎందుకొచ్చిన తెలుగు తిప్పలు చెప్పండీ...
రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి గారికి.. పాపం ఒక్కసారిగా తెలుగు మీద ప్రేమ పొంగిపోయింది. పదవీ స్వీకార ప్రమాణాన్ని తెలుగు భాషలోనే చేస్తానని ఆయన అధికారులకు చెప్పారు. దీనికి తగ్గట్లుగా అధికారులు కూడా ప్రమాణ పత్రాన్ని తయారు చేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న నాలాంటి అర్భకులకు.. హమ్మయ్య, ఈయన హయాంలో కాస్త తెలుగుకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి అని అనిపించింది. కానీ, సిఎం గారు ప్రతిజ్ఞ చేసిన తీరు చూశాక.. ఆశలు ఆవిరై పోయాయి. అయ్యా కిరణ్‌కుమార్ రెడ్డి గారూ మీకెందుకొచ్చిన తెలుగు తిప్పలు చెప్పండీ.. ఎంచక్కా మీకు అనర్గళంగా వచ్చే ఆ ఇంగ్లీషులోనే గోడు పెట్టుంటే పోయుండేది అని అనాలనిపించింది..
ఇంతకీ కొత్త సిఎం గారు పలికిందేంటంటే..
బారత దేస..
(నాలుక తిరగలేదేమో..)
సార్వబౌమ్..అ..అధికారాన్ని,
(ఇక్కడా తడబాటే..)
అంక్..అంక్..అంతకర్త శుద్ధితో..
(ఏంటో ఏడుపొచ్చేస్తోంది.. మొత్తం అర్థాన్నే మార్చేశారు)
రాజద్వేషాలు లేకుండా
(రాజశేఖరరెడ్డిని ఇంకా మరిచినట్లు లేదు)
శాసనం..శాస్..శాసనాలను
(పాపం గజిబిజిగా ఉంది కాబోలు)
విదేయత
(కింద జఠ ఉంటుందని, అది విధేయత అని ఇంగ్లిష్ మీడియం వారికి తెలియాలని రూలు లేదుగా)
నాయం చేకూర్చుతానని
(న్యాయం కామోసు..)
సిఎం గారు చేయాల్సిన ప్రతిజ్ఞ అసలు రూపం :
" నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా.. రాజ్యాంగాన్ని, శాసనాలనూ అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. "
ఇది కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకే ఉద్దేశంతో రాసింది కాదు. ఎవరూ కోరక పోయినా.. తెలుగులోనే ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్న సిఎం గారు, కనీసం ఆ ప్రమాణ పత్రాన్ని ముందుగా ఓసారి కూడా చదువుకోకుండా... తెలుగు భాషను, అంతలా పీకి పాకం పెడుతుంటే.. గుండెల్లో కళుక్కుమని.. ఈ ముక్కలు రాయాలనిపించింది. అంతే..! అయినా.. పోనీలెండి.. ఏదో మనమీద దయతో.. కిరణ్‌కుమార్‌రెడ్డి గారు.. మన తెలుగు భాషకు వీలైనంత ప్రాధాన్యతనిచ్చారని ఓ రవ్వ సంతోషిద్దాం. ఏమంటారు..?
Subscribe to:
Post Comments (Atom)
తప్పకుండా గుర్తించాల్సిన విషయం , ఆయన పరాయి రాష్త్ర ముఖ్య మంత్రి కాదు కదా
ReplyDeleteతెలుగు ఉచ్చారణ బాగుండాల్సిందే.
భాష దేముంది పాలనా బాగుంటే చాలంటే అదీ ఓకే !!
కింద నుంచి పీతలు కాళ్ళు లాగ కుండా వుండాలని
మంచే జరగాలని కోరుకుందాం
it's a state of hysteria...you can never imagine.....
ReplyDelete:)
ReplyDeletemee opikaki mee prayatnaniki bhasha pai prema ki raja sevakulandaroo mokarillali.good effort
ReplyDeleteI appreciate your post and largely agree with your view on this.
ReplyDeleteఆ state of hysteria తప్పులు చదవాలన్న నిభందన,నియమాలు లేవు.చూసికూడా తప్పులు చదవడం హైస్తీరియా అంటారా?ఇక పీతలన్తారా..ఆ పార్టీ వారే ఆ పీతలు.
ReplyDeleteప్రమాణస్వీకారానికి ముందు కాస్త మనసులో రిహార్సల్ చేసుకునుంటే బావుండేది. మన తెలుగంతా ఎక్కువభాగం సంస్కృతమయం. అది రాజకీయనాయకులకు కొరుకుడు పడదు.
ReplyDeleteవిజయ్ గారు,
ReplyDeleteమీ పరిశీలనా శక్తి కి జోహార్లు.
కనీసం, ఒకసారైనా ప్రాక్టీసు చేసి ఉంటే బాగుండేది.
~శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com
కుర్సీ ఎక్కిన సంబరంలో మాటలు తడబడ్డాయిలెండి అయినా ఆయనకు అసెంబ్లీలో చంద్రబాబు మీద ప్రయోగించే తెగులు సారీ తెలుగు భాషపై మంచి పట్టుందిలెండి.
ReplyDeleteనిజమేనండి. చూసినంతసేపు చికాగ్గానేఉంది. ఈ అంతకర్త ఏవిటా అనుకున్నాను. మీరు రాసింది చదివాక అర్ధమయింది.
ReplyDeleteనిజమే.. ముందు ఒక్కసారి చదువుకుని ఉంటే కొంత సులువై ఉండేది..
ReplyDeleteమిత్రులారా..
ReplyDeleteమీ వ్యాఖ్యానాలతో నాలో కొత్త ఉత్సాహాన్ని నింపినందుకు ధన్యవాదాలు. ఇదే తరహాలోనే నా తదుపరి రచనలనూ చదివి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.
~ విజయ్