Saturday, November 27, 2010

జర్నలిస్టు మిత్రులారా, ఇదిగో తప్పొప్పుల పట్టిక..

జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల్లో అచ్చుతప్పులు ఎక్కువగా దొర్లుతున్నాయి. ఫలితంగా.. చాలా సార్లు దురర్థం వస్తోంది. ( ఉదాహరణకు పుణ్యాంగన అంటే పవిత్రమైన స్త్రీ అని అర్థం. ఐతే, పొరపాటున పణ్యాంగన అని రాస్తే వెలయాలు, వేశ్య అని అర్థం వస్తుంది)
అందుకే ఇలాంటి దారుణాలు జరగకూడదన్న సదాశయంతో.. జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల అసలు స్వరూపాలను (వాటి తప్పు రూపాలతో సహా) ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది జర్నలిస్టు మిత్రులందరికీ ఉపయోగపడుతుందని.. ఉపయోగపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి పదాల స్వరూపాలతోనే ముగిద్దాం. తర్వాతి పోస్టులో వీటి అర్థాలు.. వినియోగించే సందర్భాల గురించి చర్చిద్దాం.

( www.journomucchatlu.blogspot.com అనే url తో ఎప్పుడైనా సరే మీరు పదాలను సరిపోల్చుకునేందుకు నా ఈ ప్రయత్నం ఉపయోగ పడుతుందని నమ్ముతున్నాను)


మీ...
విజయ్‌

తప్పు ఒప్పు తప్పు ఒప్పు
ఆగచాట్లు గచాట్లు ఆగత్యం గత్యం
అట్టాహాసం ట్టహాసం అదిగమించు ధిగమించు
అధ్యాయనం ధ్యయనం అనర్దదాయకం ర్థదాయకం
అనుభందం అనుబంధం అనుసంథానం అనుసంధానం
అంధలం అంలం అపరాథం అపరాధం
అపబ్రంశం అపభ్రంశం అపొహ పో
అప్పానంగా ప్పనంగా అభద్దం ద్ధం
అబినందన భినందన అబిమానం భిమానం
అబియోగం భియోగం అబ్యంతరం భ్యంతరం
అబ్యర్తి భ్యర్థి అభ్యుధయం భ్యుదయం
అమాత్యిడు అమాత్యుడు అమంతంగా మాంతంగా
అయోమైయంగా అయోయంగా అరాచకం అరాకం
అలంకారించు అలంరించు అవకాతవకలు అవతవకలు
ఆవగాహన వగాహన ఆవశ్యం వశ్యం
ఆగ్రహాం గ్రహం ఆశనిపాతం శనిపాతం
అశ్రద్ద అశ్రద్ధ అసబ్యంగా అసభ్యంగా
అగంతకుడు గంతకుడు అస్థమానం స్తమానం
అక్షేపించు క్షేపించు అకతాయి కతాయి
అంక్షలు ఆంక్షలు అణిముత్యాలు ణిముత్యాలు
ఆధరణ రణ ఆధర్శం ర్శం
ఆధాయం దాయం ఆమోధం ఆమోదం
ఆయుకట్టు కట్టు ఆరంబం ఆరంభం
అరిమరికలు మరికలు ఆర్బాటం ర్భాటం
ఆవరన ఆవర ఆస్రితపక్షపాతం శ్రిత పక్షపాతం
అగ్నిమాపుకం అగ్నిమాకం అత్తిసరు త్తెసరు
అర్బకుడు ర్భకుడు అష్ఠకష్ఠాలు ష్టష్టాలు
అష్ఠైశ్వర్యాలు ష్టైశ్వర్యాలు స్థవ్యస్థం అస్తవ్యస్తం
ఆధునీకరణ ఆధునికీకరణ ఆనవాయతీ ఆనవాయితీ
ఆబాలగోపాళం ఆబాలగోపాలం అబివృద్ది భివృద్ధి
అబిప్రాయం భిప్రాయం అధికృత ధీకృత
అంతర్యుద్దం అంతర్యుద్ధం అణ్వాస్త్రం ణ్వస్త్రం
అధారిటీ థారిటీ అనివారంగా అనివార్యంగా
అభ్యర్దించు అభ్యర్థించు అవస్త అవస్థ
అగాయిత్యం ఘాయిత్యం అత్యథికం అత్యధికం
అధమ అదిక్షేపించు ధిక్షేపించు
అనవతం వనతం అర్ధంతరంగా ర్ధాంతరంగా
అణుకువ కువ అతిధి అతిథి
అధిష్టానం అధిష్ఠానం అగాథం గాధం
అద్వాన్నం ధ్వానం అప్రతిష్ట అప్రతిష్ఠ
అరిష్ఠం అరిష్టం అవ్యజ వ్యా
అంతర్థానం అంతర్ధానం అతిరధుడు అతిరథుడు
అనర్ధం అనర్థం అతివృష్ఠి అతివృష్టి
అనుసంథానం అనుసంధానం అర్జి ర్జీ
ఆక్రమం క్రమం అక్షంతలు క్షింతలు
అగ్రస్తానం అగ్రస్థానం అజమాయషీ అజమాయిషీ
అత్తలాకుత్తలం లాకులం రంగరంగవైభవం అంగరంగ వైభవం
అడ్డాదిడ్డం డ్డదిడ్డంగా అదృస్యం అదృశ్యం
అధీగమించు ధిగమించు అద్యక్షుడు ధ్యక్షుడు
అనుచెరుడు అనురుడు అనుచిత్తంగా అనుచితంగా
అనుసందానం అనుసంధానం ఆహుతులు హూతులు
ఆక్షేపన ఆక్షేప ఆచ్చాదన చ్ఛాదన
అతిథ్యం తిథ్యం ఆస్థులు స్తులు
ఆస్థిపాస్థులు స్తిపాస్తులు ఆర్దిక ర్థి
ఆంద్రుడు ఆంధ్రుడు అల్పఫీడనం అల్పపీడనం
ఇంగీతం ఇంగితం ఇథోదికంగా తోధికంగా
ఇబ్భంది బ్బంది ఇబ్బుడిముబ్బుడి బ్బడిముబ్బడి
ఇనస్పెక్టర్‌ న్‌స్పెక్టర్ ఇల్లరికటం ఇల్లరికం
ఈర్ష ర్ష్య ఈసుడింపు డింపు
ఉద్గాటించారు ద్ఘాటించారు వుత్తమం త్తమం
ఉల్లంగించారు ఉల్లంఘించారు ఉచ్ఛారణ చ్చారణ
ఉపోద్గాతం ఉపోద్ఘాతం ఉన్నపలంగా ఉన్నపళంగా
ఉపాద్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉత్తానపతనాలు త్థానపతనాలు
గుండ్రాళ్లదెబ్బ ఉండేలు దెబ్బ వుచితంగా చితంగా
ఉద్బవించారు ద్భవించారు ఉత్ఫాథం త్పాతం
ఉఢాయించారు డాయించారు ఉదాశీనత ఉదాసీనత
ఉత్సావం త్సవం ఉధ్యమం ద్యమం
ఉదాహారణ ఉదారణ ఉధ్వాసన ద్వాసన
ఉద్భోదించారు ద్బోధించారు ఉపాచారం చారం
ఉపగృహం ఉపగ్రహం ఉపయోగ్యం ఉపయోగం
ఉపదేశ్యం ఉపదేశం ఉప సంహారణ ఉపసంరణ
ఉపాది ఉపాధి ఉవ్విల్లూరు ఉవ్విళ్లూరు
ఊరుమ్ముడి ఊరుమ్మడి ఎడతెరుపి ఎడతెరిపి
ఏకాఎకిన కాఎకిన ఎద్ధడి ద్దడి
ఎన్నైక న్ని, ఎంపిక ఏన్నర్థంగా ణ్ణర్థంగా
ఏమరుపాటిగా ఏమరుపాటుగా ఐచ్చిక చ్ఛి
ఏకంతంలో కాంతంలో ఐక్యమత్యం మత్యం
ఐఖ్యం క్యం ఔఛిత్యం చిత్యం
ఒడంభడిక ఒడండిక కధ
కనిష్ఠం కనిష్టం కౌన్సిలింగ్‌ కౌన్సెలింగ్‌
కటాకట కట ఖచ్చితంగా చ్చితంగా
కలక్టరేట్ లెక్టరేట్‌ క్రోదం క్రోధం
కమీశనర్‌ మినర్‌ క్రమబద్దీకరణ క్రమబద్ధీకరణ
కూలంకశంగా కూలంకషంగా ఖంగారు కంగారు
కలువరింత వరింత కాపురస్తులు కాపురస్థులు
కల్లోళం కల్లోలం కాలుశ్యం కాలుష్యం
కార్యదర్సి కార్యదర్శి కూలంఖషంగా కూలంషంగా
కీర్తిసేషులు కీర్తిశేషులు కాయిలా ఖాయిలా
క్రీఢాకారులు క్రీడాకారులు ఖచ్చితంగా చ్చితంగా
కాకీ ఖాకీ గాతం ఘాతం
గర్బం ర్భం గాయికుడు గాకుడు
గాయిని గాని గ్రంధసాంగుడు గ్రంసాంగుడు
గ్రంధం గ్రంథం గుభాళింపు గుబాళింపు
గుత్తాదిపత్యం గుత్తాధిపత్యం గృహస్తుడు గృహస్థుడు
గూడాచారి గూచారి గడిబిడ బిడ
గౌరవార్ధం గౌరవార్థం గంబీరంగా గంభీరంగా
గమినించు నించు గుభులు గుబులు
గరానా రానా చతుర్ది చతుర్థి
ఛట్టబద్దం ట్టబద్ధం చిరనామ చిరునామా
చతుష్ఠయం చతుష్టయం చేతన్యం చైతన్యం
చాంపియన్‌ ఛాంపియన్‌ జయంత్యోత్సవం జయంత్యుత్సవం
జనార్ధన జనార్ద జీవచ్చవం జీవచ్ఛవం
జీర్ణుద్ధరణ జీర్ణోద్ధరణ జళిపించు ళిపించు
జఠిలం టిలం ఢీలాపడు డీలా పడు
డెప్యూటీ డిప్యూటీ డైరక్టరేట్ డైరెక్టరేట్‌
డ్రయినేజీ డ్రైనేజీ ఢక్కామక్కీలు క్కామొక్కీలు
డిశంబర్‌ డిసెంబర్‌ డయిరీ డెయిరీ
డమరుకం మరుకం తలుకుబెలుకు ళుకుబెళుకు
తనికీ తనిఖీ తాలుకా తాలూకా
తాదాత్మం తాదాత్మ్యం తటస్తం తటస్థం
తాకత్తు తాహతు తలక్రిందులు ల్లకిందులు
త్రైపక్షిక త్రైపాక్షిక తిరోగామం తిరోమనం
తలవొంపులు తలవంపులు తృటి త్రుటి
తిరస్కారించు తిరస్కరించు దగ్దం గ్ధం
తీర్ధం తీర్థం ద్వందవైఖరి ద్వంద్వ వైఖరి
ధృడం దృఢం దుష్పలితం దుష్ఫలితం
దరకాస్తు దరఖాస్తు దృక్ఫదం దృక్పథం
ధీటుగా దీటుగా దిగ్భందం దిగ్బంధం
దౌర్బాగ్యం దౌర్భాగ్యం ధండకం దండకం
దిగ్బ్రాంతి దిగ్భ్రాంతి దాఖలు ఖలు
దైర్యం ధైర్యం దగ్దం గ్ధం
దంఢయాత్ర దంయాత్ర దుర్ధినం దుర్దినం
దహానం నం దర్మాసనం ర్మాసనం
దషకం కం దిక్కరించు ధిక్కరించు
దోహధపడు దోహపడు ద్యేయం ధ్యేయం
దాటి ధాటి దృవీకరించు ధ్రువీకరించు
ధురందరుడు దురంరుడు దుర్బేధ్యం దుర్భేద్యం
దరలు రలు నిర్ద్వందంగా నిర్ద్వంద్వంగా
దూమపానం ధూమపానం నిర్ధారణ నిర్ధరణ
నిముషం నిమిషం నిషేదిత నిషేధి
నిర్భందం నిర్బంధం నిసృహ నిస్పృ
నిశ్చితార్ధం నిశ్చితార్థం నిర్ధిష్టంగా నిర్దిష్టంగా
నిశేదాజ్ఞలు నిషేధాజ్ఞలు నెంబరు నంబరు
నేరస్తులు నేరస్థులు నిర్ధయ నిర్దయగా
నేపద్యం నేపథ్యం న్యాయస్తానం న్యాయస్థానం
నిరూపయోగం నిరుపయోగం నసించు శించు
నిర్ధాక్షిణ్యం నిర్దాక్షిణ్యం నిక్కచ్ఛిగా నిక్కచ్చిగా
నదీనదులు నదీనదాలు నిమత్తం నిమిత్తం
నాస్థికుడు నాస్తికుడు నిరాయుదీకరణ నిరాయుధీకరణ
నిఘ్రహం నిగ్రహం నివృతి నివృత్తి
నిరాఠంకంగా నిరాటంకంగా నిర్భందం నిర్బంధం
నిరాహార ధీక్ష నిరాహార దీక్ష నిర్వీరం నిర్వీర్యం
నిర్ధేశ్యం నిర్దేశం నిష్క్రమింఛారు నిష్క్రమించారు.
నిర్వాఖం నిర్వాకం నైవేధ్యం నైవేద్యం
నివేధిక నివేది ప్రధమ ప్ర
నీరషించు నీరసించు పట్టబద్రులు పట్టద్రులు
ప్రత్యామ్నం ప్రత్యామ్నాయం పుంకానుపుంకాలు పుంఖానుపుంఖాలు
పంఛాయతీ పంచాయితీ పునర్వవస్తీకరణ పునర్వ్యవస్థీకరణ
పటిష్ఠం పటిష్టం ప్రయివేటు ప్రైవేటు
పునరుద్గాటించు పునరుద్ఘాటించు పశుసంవర్దక పశుసంవర్ధ
ప్రాధమిక ప్రామిక ప్రాదేయపడు ప్రాధేయపడు
పరిణామ్యం పరిణామం పరివాహక రీవాహక
పురష్కారం పురస్కారం పర్యావసానం ర్యవసానం
పరిక్ష రీక్ష ప్రణాలిక ప్రణాళి
పరోపంగా పరోక్షంగా పించెను పింను
పలయానం లానం ఫుకారు వదంతి
పల్లెత్తమాట ల్లెత్తుమాట పరంబోకు పోరంబోకు
పీపాస పిపాస ప్రచ్చనం ప్రచ్ఛన్నం
పూర్వత్తరాలు పూర్వోత్తరాలు ప్రతిబ ప్రతి
ప్రక్షాలనం ప్రక్షానం ప్రతిక ప్రతీ
ప్రతిష్ట ప్రతిష్ఠ ప్రబాతం ప్రభాతం
ప్రత్యర్ధి ప్రత్యర్థి ప్రలోబం ప్రలోభం
ప్రబంజనం ప్రభంజనం ప్రశక్తి ప్రక్తి
ప్రమానం ప్రమాణం ప్రాంగనం ప్రాంగణం
ప్రవాశం ప్రవాసం భాద్యత బాధ్య
పందారం పందేరం భీభత్సం బీత్సం
బాహబాహి బాహాబాహీ భహిరంగంగా హిరంగంగా
భుద్ది బుద్ధి బ్రహ్మరధం బ్రహ్మరథం
భడుగు డుగు బీష్మించు భీష్మించు
బృంధావనం బృందావనం బౌతిక భౌతిక
బవిత విత భ్రష్ఠుడు భ్రష్టుడు
బేషజం భేషజం మర్థించు ర్దించు
బాగస్తులు భాగస్థులు మద్యాన్నం మధ్యాహ్నం
భూస్తాపితం భూస్థాపితం మనస్థాపం మనస్తాపం
మధ్యపానం ద్యపానం మలేషియా మలేసియా
మదువు ధువు మెకువ మెకువ
మరమత్తు మరమ్మతు మార్చ్ మార్చి
మార్ధవం మార్దవం మితృడు మిత్రుడు
మహాత్యం మహాత్మ్యం మమైకం మేకం
మథలబు లబు యధాతధం థాథం
మనోనిబ్భరం మనోనిబ్బరం యుద్దం యుద్ధం
యధార్థం థార్థం యదేచ్ఛగా ధేచ్చగా
యాదృచ్చికం యాదృచ్ఛికం రబస
యవ్వనం యౌవనం రంగేళిరాట్నం రంగురాట్నం
రధం థం రొచ్ఛు రొచ్చు
రిజిష్ట్రార్‌ రిజిస్ట్రార్‌ రవుతు రౌతు
రాజదాని రాజధాని లాటీఛార్జి లాఠీచార్జ్
రోదశి రోదసి లంకణం లంణం
లబ్ధిదారులు బ్దిదారులు వైశమ్యం వైమ్యం
లక్షం క్ష్యం విద్యుద్ఘాతం విద్యుదాఘాతం
వ్యర్ధం వ్యర్థం వార్శికం వార్షికం
వ్యాహ్యాళి వాహ్యాళి విఛక్షణ విక్షణ
విమర్ష విమర్శ వ్యక్తిగథం వ్యక్తిగతం
వినోధం వినోదం వేధిక వేది
విరాలం విరాళం వెవహారం వ్యవహారం
విస్పోటన విస్ఫోటన వ్యాఫారి వ్యాపారి
వెవసాయం వ్యవసాయం శబ్ధం బ్దం
వ్యాక్యానం వ్యాఖ్యానం షాశనం శాసనం
వాయగండం వాయుగుండం స్మశానం శ్మశానం
శతగ్ని శతఘ్ని శికారు షికారు
షాతం శాతం సమర్ధించడం సమర్థించడం
శోదన శో సంభోదన సంబోధన
శృతి శ్రుతి సషేశం శేషం
సధస్సు స్సు సమృద్ది సమృద్ధి
స్తోమత స్థోమత సారధి సాథి
సంషయం సంయం స్తలం స్థలం
సంగటం సంటం సంస్త సంస్థ
సదుద్ధేశ్యం సదుద్దేశం సృహలో స్పృహలో
స్తిరం స్థిరం సఛివులు చివులు
స్వచ్చందంగా స్వచ్ఛందంగా సందర్బం సందర్భం
స్తితిగతులు స్థితిగతులు సమీకరనాలు సమీకరణాలు
సంజాయషీ సంజాయిషీ సంస్తాగతం సంస్థాగతం
సంథరించు సంరించు సమిక్ష మీక్ష
సబ్యుడు భ్యుడు సహాకారం కారం
సమర్ధన సమర్థ సౌష్టవం సౌష్ఠవం
సమిష్టి ష్టి స్తాయి స్థాయి
సవరన సవర స్తూలంగా స్థూలంగా
సవుజన్యం సౌజన్యం స్ఫందన స్పందన
స్తావరం స్థావరం హేమాహేమిలు హేమాహేమీలు
స్నాతకుత్సవం స్నాతకోత్సవం హుటాహుటన హుటాహుటి
స్వానుబవం స్వానువం క్షిఫణి క్షిణి
హటాత్తుగా ఠాత్తుగా హడావిడి హడావుడి

10 comments:

  1. బాగున్నాయి మీ ముచ్చట్లు... పాత్రికేయులకు ఉపయోగం సంగతి పక్కనబెడితే ఇవి "మితృన్ని తోలుకెల్లి బయంకరంగా సధస్సులో వ్యాక్యానంతో భీభత్స యుద్దం" చేసే మన బ్లాగర్ మిత్రులకు మటుకు "భాఘా" ఉపయోగపడతాయి.

    ReplyDelete
  2. విజయకుమార్ గారూ! మీ ప్రయత్నం అభినందనీయం. ఓపిగ్గా ఎన్నో పదాలకు సరైన రూపాలను అందించారు. ఇవి జర్నలిస్టులకే కాదు; తెలుగులో రాసే బ్లాగర్లకూ, రచయితలకూ, ఇతరులకూ కూడా ఉపయోగపడతాయి.

    అయితే మీరిచ్చిన కొన్ని పదాల్లో పొరపాట్లు దొర్లాయి.

    * ‘నేరస్థులు’ అనే మాట కూడా సరైంది కాదు. ‘స్థ ’ అంటూ ‘ఉన్న’ అని అర్థం. ఉదా: గ్రామస్థులు. నేరంలో ఉన్నవాడు అంటే నేరం చేసినవాడు అనే భావం స్ఫురించదు. ‘నేరగాడు’ అనే వాడుక ఉంది.
    * మహాత్మ్యం కాదు- మాహాత్మ్యం సరైన రూపం.
    * అర్థంతరం కాదు- అర్థాంతరం సరైన రూపం. (సవర్ణదీర్ఘ సంధి).
    * మెళకువ కాదు- మెలకువ సరైన రూపం.
    * మమేకం కాదు- మమైకం సరైన రూపం.
    * యదేచ్చగా కాదు- యదేచ్ఛగా సరైన రూపం.
    * ఇంగ్లిష్ లో వత్తులుండవు కాబట్టి ‘చాంపియన్’ అనే మాట సరైనదే.

    ReplyDelete
  3. మిత్రమా వేణూ..
    మీ పరిశీలనాత్మక వ్యాఖ్యకు ధన్యవాదాలు. అర్ధంతరం అటుదిటైంది. మార్చేశాను. మెళకువ.. మెలకువ అర్థ భేదముంది. దాన్ని వివరించాల్సింది. మెళకువ అంటే పటిమ, మెలకువ అంటే స్పృహలో ఉండడం అన్నవి అర్థాలు. మమైకం అన్నది వ్యంగ్యవ్యాఖ్యానాలతో కూడిన రచనల్లో వాడతారు. దాని అసలు స్వరూపం మమేకమే.ఇక ఇంగ్లీషు పదాల విషయంలో ఉచ్చారణకే ప్రాధాన్యతనిచ్చాను.ఏమైనా మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు.

    ReplyDelete
  4. An Excellent Effort and an awesome post, as always.

    ~Sasidhar Sangaraju
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete
  5. చాలా మంచి సమాచారమండీ. జర్నలిస్ట్ మిత్రులకే కాదు మాలాంటి వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

    ReplyDelete
  6. జర్నలిస్టు మిత్రులు మీరిచ్చిన తప్పొప్పుల పట్టికను ఇప్పటికే చాలాసార్లు చూసుంటార్లెండి. సంకలినుల్లో మీ టపా రోజూ దర్శనమిస్తూ విసుగు పుట్టిస్తోంది. కొత్త పోస్టేమైనా రాయండి!

    ReplyDelete
  7. Vijay,
    Well done. ఇది నిజమైన భాషాసేవ.
    Keep it up.
    Ramu
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  8. జర్నలిస్టుల మీద మీకున్న శ్రద్ధకు ధన్యవాదాలండీ! ఈ తప్పుల్లో ఎక్కువ భాగం పొరపాటున అచ్చు తప్పులుగా సంభవించేవే కనపడుతున్నాయి. శ్రద్ధతో ఇన్ని తప్పుల్ని, వాటి సవరణలను ఇచ్చినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. కానీ గత వారం నుంచీ ఈ పోస్టు రోజూ సంకలినుల్లో రిపీట్ అవుతోంది. ఎక్కువ మంది జర్నలిస్టులు ఆట్టే లేని ఈ బ్లాగ్లోకంలో మీరింత శ్రమతో దీన్ని రోజూ దీన్ని పదే పదే ప్రచురించనవసరం లేదనుకుంటాను.

    ReplyDelete
  9. మిత్రులారా,
    మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. మామూలుగా.. నా బ్లాగుకు నేరుగా వచ్చే వారికన్నా, సంకలినుల ద్వారా వచ్చే సందర్శకులే ఎక్కువ. అందుకే.. నేరుగా జర్నోముచ్చట్లు బ్లాగ్‌కి వచ్చే వారికి, తెలుగు పదాల తప్పొప్పుల పట్టికే నేరుగా కనిపిస్తే కాస్తంత ఫలితం ఉంటుందన్న భావనతో.. దీన్ని సాంకేతికంగా సర్దుబాటు‌ చేశాను. అదే నా కొంప ముంచింది. ప్రతిరోజూ సంకలినులలో కనిపిస్తోంది. హారం మిత్రులు కూడా దీన్ని నా దృష్టికి తెచ్చారు. అందుకే.. వెంటనే గతంలో చేసిన సాంకేతిక సర్దుబాట్లను మళ్లీ మార్చేశాను. ఇక మీకు కొత్త పోస్టులు వేసినప్పుడు మాత్రమే నా బ్లాగ్‌ కనిపిస్తుంది. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు.
    విజయ్‌

    ReplyDelete