కొన్నిసార్లు తెలియకుండా పేర్లను తప్పుగా రాస్తుంటాము. ఇట్లాంటి వాటిలో రమేష్... సురేష్.. దినేష్... మొదలైనవి కొన్ని. ఈ పేర్ల ఓనర్లు కూడా తాము సరైన రూపంలో రాస్తున్నామా లేదా అని ఆలోచించకుండా తప్పు రూపంలోపేర్లు రాసేస్తుంటారు. ఇంతకీ, రమేష్ అంటే తప్పేంటి..? ఓసారి చూద్దాం..
ఉదాహరణకు రమేష్ ని తీసుకుందాం. ఈ పదాన్ని విడదీస్తే..
రమ + ఈష్ = రమేష్.
రమ అంటే లక్ష్మీ దేవి,
ఈష్ లేదా ఈష అంటే నాగటి యేడికోల (నాగలి కోల) అని అర్థం
రమేష్‌కి పూర్తిగా అర్థం చెప్పాలంటే.. లక్ష్మీదేవి నాగలి కోల అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
లక్ష్మీదేవికి, నాగలి కోలకి ఏమిటి సంబంధం చెప్పండి...?
అందుకే.. ఈ పదాన్ని రమేశ్ అని రాయాలి.
రమ + ఈశు(డు) = రమేశుడు
రమ అంటే లక్ష్మీదేవి.
ఈశుడు అంటే శివుడు, భర్త, రాజు అని అర్థాలున్నాయి.
రమ+ఈశుడు = రమేశుడు... అంటే లక్ష్మీదేవి భర్త ... విష్ణువు అని అర్థం
అలాగే సురేశు (దేవతలకు రాజు), మహేశు (మహి(భూమికి) రాజు), దుర్గేశు (దుర్గకు భర్త), తదితర పదాలను ష్.. తో కాకుండా శ్ తో రాస్తేనే అర్థవంతంగా ఉంటాయి.
అక్షయ కుమార్ :
ఈ పేరు చూస్తే మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ... ఇంతకీ ఈ పేరు తొలి యజమాని ఎవరో తెలుసా..? లంకాధిపతి రావణుడి కుమారుడు ఈ పేరు తొలి యజమాని. భారత కథ ప్రకారం అక్షయకుమారుడు రావణాసురుడి కుమారుడు. లంకకు వచ్చిన హనుమంతుడిని బంధించేందుకు వెళ్లి, హనుమ చేతిలో మరణిస్తాడు. ఈ సందర్భంలో అక్షయకుమారుడి ప్రస్తావన వస్తుంది.
మరి మన బాలీవుడ్ అక్షయకుమార్కి ఈ కథ తెలిస్తే.. ఎలా పీలవుతాడో..!
సరదాగా గమనిస్తే ఇట్లాంటి గమ్మత్తులు పుష్కలంగా దొరుకుతాయి. తర్వాతి పోస్టులో మళ్లీ ఇట్లాంటి మరిన్ని పదాలు అర్థాలతో కలుద్దాం. బై బై
బై బై
Tuesday, November 30, 2010
బాబాయి దూరమవడం.. జగన్ స్వయంకృతం....!
బాబాయి అబ్బాయి రాజకీయంగా విడిపోయారు. కాంగ్రెస్ వంచకి అని అబ్బాయి విమర్శిస్తుంటే.. అబ్బే అదేం కాదు.. పార్టీ ది బెస్ట్ అని బాబాయి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇడుపులపాయలో బాబాయి అబ్బాయి మధ్య సయోధ్య కుదురుతుందని.. ఇద్దరూ కలిసి పోతారని అందరూ భావించారు. వివేకానందరెడ్డి కుటుంబానికే ప్రాధాన్యతనిస్తారని ఊహించారు. అయితే.. వివేకానందరెడ్డి, అన్న వైఎస్సార్ గారి కుటుంబం కన్నా, కాంగ్రెస్ కుటుంబమే ముఖ్యం అని తెగేసి చెప్పారు.
ఇప్పుడు బాబాయి-అబ్బాయి విడిపోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానమే కారణమా..? కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నకు సమాధానం తేలిగ్గా దొరుకుతుంది.
2003వ సంవత్సరం వరకూ.. జగన్మోహన్రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. తండ్రి చాటు బిడ్డగా.. పవర్ ప్రాజెక్టు యజమానిగా.. కొనసాగారు. అయితే.. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేశారు. తండ్రి ఆశీస్సులతో ఏకంగా పార్లమెంటులోకే ప్రవేశించాలని ఉవ్విళ్లూరారు. తనయుడిపై మమకారంతో.. వైఎస్సార్ కూడా జగన్ ఉత్సాహాన్ని కాదనలేక పోయారు. తనయుడి కోసం తమ్ముడినే బలిపశువును చేయాలని చూశారు. దీంతో మనస్తాపానికి గురైన వివేకానందరెడ్డి, ఎంపీ స్థానాన్ని వదులుకుని రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని అప్పట్లో అలక వహించారు. వైఎస్ఆర్, ఆయన తనయుడు జగన్ దీన్ని ఆమోదించినట్లే కనిపించింది. అయితే.. ఈ రచ్చ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో.. పార్టీ అధిష్ఠానదేవత సోనియాగాంధీ, జోక్యం చేసుకున్నారు. దీంతో, వివేకా రాజీనామా, జగన్ రాజకీయ రంగ ప్రవేశం అంశాలు అప్పటికి నిలిచిపోయాయి. ఈ ఘట్టం నుంచే జగన్.. బాబాయి వివేకా అంటే గుర్రుగా ఉంటున్నారన్న వార్తలున్నాయి.
2004 ఎన్నికల్లో పంతం నెగ్గించుకోలేక పోయినా.. 2009 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి వివేకానందరెడ్డిని రాజకీయంగా నియంత్రించడంలో సఫలమయ్యారు. బాబాయి వివేకా ప్రాతినిథ్యం వహించిన కడప పార్లమెంటరీ స్థానం నుంచి జగన్ పోటీ చేసి గెలిచారు. దురదృష్టవశాత్తూ వైఎస్సార్ చనిపోయాక, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా వివేకా ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడూ ఆయన మనోభీష్టం నెరవేరలేదు. నానా అవస్థలూ పడి.. ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకోగలిగారు.
జగన్మోహనరెడ్డి ఆగస్టు నెల్లో.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ.. రెండో విడత ఓదార్పు యాత్ర తలపెట్టినప్పుడు కూడా వివేకానందరెడ్డి విభేదించారు. తాను సోనియాకు విధేయుడినంటూ ఓ లేఖనూ రాశారు.
తాజాగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఘట్టంలోనూ.. వివేకానందరెడ్డి, అన్నగారి అబ్బాయి జగన్‌ని విభేదించారు. అధిష్ఠానం ఆధిపత్యాన్ని అంగీకరించారు. పైగా తనకు మంత్రి పదవి కావాలని ఆయన విన్నవించుకున్నారు. ఈ క్రమంలో.. వివేకాకు మంత్రి పదవి ఖాయమన్న వార్తలు వచ్చాయి.
దీంతో అలిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌తో ఈ ఉదయం వివేకా విడిగా భేటీ అయ్యారు. వీరి భేటీ కేవలం రెండు నిమిషాలకే పరిమితమైంది. హాల్లోకి వెళ్లీ వెళ్లగానే.. జగన్ బాబాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. దీంతో మనస్తాపానికి గురైన వివేకా.. జగన్‌కు దూరంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవ నిజానిజాలెంతోగానీ.. వివేకానందరెడ్డి, జగన్‌ను కాదని, కాంగ్రెస్ అధిష్ఠానంతోటే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దాదాపు ఆరేడేళ్లుగా బాబాయి-అబ్బాయిల మధ్య కొనసాగుతున్నస్పర్థల నేపథ్యాన్ని.. అధిష్ఠానం, చక్కగా వినియోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. వివేకా దూరం కావడం జగన్‌కు కాస్త చికాకు కలిగించే అంశమే.
Monday, November 29, 2010
శాండీ.. వుయ్ లవ్ యు

నిద్ర : మస్తుగా నిద్రపోతుంది. స్థలం అక్కడా ఇక్కడా అని చూడదు. దానికోసం ఓ గూడు ఏర్పాటు చేసినా.. బండలమీద పడుకునేందుకే ప్రాధాన్యతనిస్తుంది.
మెలకువ : నిద్రనుంచి లేవగానే ఎక్సర్సైజ్ చేయాలంటుంది.మమ్మల్ని రాచి రంపాన పెడుతుంది. తనే, ఓ ప్లాస్టిక్ బోన్ నోటితో కరచుకు వచ్చి దాన్ని విసరండి.. నేను తీసుకు వస్తాను.. అన్నట్లు సైగలు చేస్తుంది. శాండీ బాధ భరించలేక ప్లాస్టిక్ బోన్‌ను దాచామనుకోండి.. వాటర్ బాటిల్, లేదా కర్ర ముక్క ఏది పడితే దాన్ని కరుస్తూ.. ఆడుకుంటూ నానా సందడీ చేస్తుంది.






గమనిక : స్నానం తప్ప మిగతావన్నీ దినచర్యలో భాగమే.
జగన్ నిర్ణయం ఫలితాలు ఎలా ఉండొచ్చు...?

జగన్ బహిరంగ లేఖలోని కీలకాంశాలు :
- పదవుల ఆశ చూపి కుటుంబంలో చిచ్చు రేపారు
- తనను బయటకు పంపేందుకు సాక్షి కథనాన్ని బూతద్దంలో చూపారు
- తనను ఒంటరిని చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు.
- ఓదార్పు యాత్రపై అనవసర రాజకీయ రాద్దాంతం చేశారు
- వైఎస్సార్ ఫోటోలను ఉద్దేశపూర్వకంగానే సభల్లో పెట్టలేదు
- తనకు, తల్లి విజయమ్మకు అపాయింట్మెంట్ విషయంలో నెల్లాళ్లు వేచిచూసేలా చేశారు
- చిన్నాన్నవివేకానందరెడ్డికి, చిరంజీవికి.. మేడం సోనియా.. క్షణాల్లో ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారు..?
- వైఎస్సార్ మృతిపై కంటితుడుపు దర్యాప్తు చేయించారు.
ఈ అన్ని కారణాల వల్ల తాను మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు జగన్ ప్రకటించారు. ఆయన బాటలోనే వైఎస్సార్ సతీమణి, జగన్ తల్లి విజయలక్ష్మి, పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
జగన్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఏఏ మలుపులు తిరిగే అవకాశం ఉంది..? ఏ ఏ పార్టీకి ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది..?
జగన్ వ్యూహమేంటి..?
ప్రస్తుతం తల్లితో కలసి.. జగన్మోహన్రెడ్డి పదవులకు రాజీనమా చేసినా.. తన అనుచర ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది వ్యూహాత్మకమేనని అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు తన అనుచరులను రాజీనామా చేయిస్తే.. కేవలం 20 లోపు ఎమ్మెల్యేలే బయటికి వస్తారు. దీని వల్ల జగన్ సాధించేది గానీ.. అధిష్ఠానం మెడలు వంచే అవకాశం గానీ ఉండదు. జగన్ వెంట ఎంతమంది ఉన్నారో అన్న ఊహాగానాల చర్చను సజీవంగా ఉంచుతూనే... మరికొంత మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు.. జగన్ శిబిరం ప్రయత్నిస్తుందన్న భావన కలుగుతోంది.
చిరు పైనే గురి..?

జగన్ శిబిరం తక్షణ గురి ప్రజారాజ్యం పార్టీ పైనే ఉంటుందన్నది తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పటికే.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి దంపతులు.. జగన్ కుటుంబంతో వియ్యమందారు. వీరికి ప్రజారాజ్యంలో కొనసాగడం కన్నా.. జగన్‌తో అనుబంధాన్ని కొనసాగించడమే కీలకంగా మారుతుంది. వీరికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా.. ప్రజారాజ్యం పార్టీలో మరికొంత మంది ఎమ్మెల్యేలు.. వీరి వెంట వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈలెక్కన చూస్తే.. జగన్ శిబిరం గట్టిగా ప్రయత్నిస్తే.. ప్రజారాజ్యం పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తాను పార్టీ స్థాపించే లోపే.. (టిడిపి, పిఆర్పీల చీలికతో) తన బలాన్ని గణనీయంగా పెంచుకోవాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అన్వేషించక తప్పదు.
తెరాస పై అందరి దృష్టి.. :
చిరంజీవి పార్టీని చీల్చితే జగన్ శిబిరం బలం మరికొంత పెరుగుతుంది. తద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితి రాకుండా.. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాన రాష్ట్ర సమితి వైపు చూసే అవకాశాలూ కొట్టి పారేయలేము. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానన్న కెసిఆర్ మాటలు ఈ సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలు అన్నా.. కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ అప్పటి మాటలు టానిక్‌లా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. తెరాసతో 2004 ఎన్నికల నాటి మైత్రినే పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నించే అవకాశాన్నీ కొట్టిపారేయలేము.
అయితే కెసిఆర్.. ఈసారి అంత తేలిగ్గా కాంగ్రెస్‌కు మచ్చిక అవుతారని భావించలేము. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తోడ్పాటునందిస్తానన్న ఒక్క ప్రకటనకే.. తెలంగాణలో కెసిఆర్‌పై తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఆయన చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందని.. తెరాస నేతలే చెబుతున్న మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కెసిఆర్ స్వతంత్రించి కాంగ్రెస్‌తో దోస్తీ కడితే.. ఆయనకు, ఆయన పార్టీకి తెలంగాణలో పుట్టగతులుండవు. అందుకే, కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ ప్రక్రియకు సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన చేయించి, ఆతర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి పాలన..?
అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెలువరించే సాహసం చేస్తుందా..? ప్రకటన చేసినా.. రాష్ట్రాన్ని చీల్చినా.. తెలంగాణలో, పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. తెరాస లేదా తెలంగాణ పార్టీల దయాదాక్షిణ్యాల మీదే కాంగ్రెస్ ఆధార పడాల్సి ఉంటుంది. ఇక్కడి నాయకత్వం బలహీన పడే అవకాశం ఉంది. తద్వారా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చు. మరోవైపు.. సీమాంధ్ర ప్రాంతంలోనూ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. జగన్ ఓవైపు, బలమైన తెలుగుదేశం మరో వైపు అక్కడ పోటీ పడతాయి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ అవకాశాలు అంత తేలిగ్గా ఏమీ ఉండవు. అంటే ఏకకాలంలో.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీ గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే.. అన్ని ఊహాగానాలను, ఆశావహులందరి విశ్వాసాలను దెబ్బతీస్తూ.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్నీ పార్టీ పరిశీలిస్తుంటుంది. నమ్మకస్తుడైన గవర్నర్ నరసింహన్ ద్వారా.. తెలంగాణ సహా.. అన్ని పరిస్థితులను చక్కదిద్దాక, కాంగ్రెస్ పార్టీ, మళ్లీ ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారమూ జరుగుతుంది. ఇదీ రాష్ట్రంలో కొనసాగుతున్న చర్చోపచర్చల సారాంశం. నిజ పరిణామాలు ఎలా ఉండబోతాయో.. వేచిచూడక తప్పదు.
Saturday, November 27, 2010
జాతి అంటే..?
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది.. అంటూ ఘంటసాల మధురంగా ఆలపించిన పాట (తల్లా పెళ్లామా సినిమాలోది అనుకుంటా) విన్నా. ఈ పాట ఇంతకు ముందు కూడా చాలా సార్లు విన్నా. ఎప్పట్లాగానే మనసుకు ఆనందాన్ని కలిగించింది. అయితే ఈసారి ఆనందంతో పాటే.. ఓ అనుమానాన్నీ కలిగించింది. తెలుగు జాతి మనది అన్న వాక్యంలో... జాతి అంటే.. ఏంటి? అన్నది ఆ అనుమానం. సాధారణంగా జాతి అన్న పదం వినగానే.. ఒక వర్ణ సమూహం అన్న విస్తృతార్థం తెలుస్తుంది. కానీ జాతి అన్న పదాన్ని కచ్చితంగా నిర్వచిద్దామనుకుంటే.. కాస్త అయోమయంగా అనిపించింది. ఇంకేముందీ.. ఛలో శబ్దరత్నాకరం.
జాతి అంటే..
కులము, పుట్టుక, సామాన్యం, అర్థాలంకారం, పద్యభేదం, పొయ్యి, జాజికాయ అని అర్థాలున్నాయి.
పురుష జాతులు నాలుగట.
(1) భద్రుడు,
(2) దత్తుడు
(3) కూచిమారుడు
(4) పాంచాలుడు
స్త్రీ జాతులు కూడా నాలుగేనట.
(1) పద్మిని
(2) హస్తిని
(3) శంఖిని
(4) చిత్రిణి
జాతకుడు అంటే పుట్టినవాడు,
జాతము అంటే సమూహం
జాతవేదుడు అంటే అగ్నిదేవుడు
జాతాపత్య అంటే బాలింత అన్న అర్థాలూ ఉన్నాయి.
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలని చాతుర్వర్ణాలని అంటారు. వాటి అర్థాలను పరిశీలిస్తే..
(1) బ్రహ్మ : బ్రాహ్మణుడు, పరమాత్మ
(2) క్షత్రియ : రాచవాడు, రాజు
(3) వైశ్య : కోమటివాడు, ఆర్యుడు
(4) శూద్రుడు : 4వ జాతి వాడు
శూద్రుడు అంటే 4వ జాతి వాడు అన్నారు. మరి అందులోకి ఎవరెవరు వస్తారు..?
వ్యావహారికుడు : మంత్రి
గోరక్షక : ఆవులు కాసేవాడు
శిల్పక : శిల్పి. ( ఈ శిల్పి శిలలను చెక్కే వాడు కాదు. ఈ కోవలో ఏడుగురు శిల్పులు ఉన్నారు. వారు.... వడ్లంగి, సాలె, మంగలి, చాకలి, ముచ్చి. (ముచ్చి అంటే చిత్రకారుడు)
పంచాణ : శిల్పి (శిలలను శిల్పాలుగా మలిచేవాడు)
కుంభకార : కులాలుడు, కుమ్మరి
తంతువాయి : సాలెవాడు (తంతునాభము అన్నా తంతువాయము అన్నా సాలెపురుగు అని అర్థం. తంతువాయము నుంచి తంతువాయి వచ్చింది.)
క్షౌరక : మంగలి
రజక : చాకలి
వస్త్రఛేదక : దుస్తులు కత్తిరించే వాడు (దర్జీ)
చర్మకార : మాదిగ
తిలఘాత : గాండ్లవాడు (తిలలు అంటు నువ్వులు ఘాత అంటే నలిపడం అని అర్థం. నువ్వుల్ని నలిపి నూనె తీసే వృత్తి వారు గాండ్లవారు)
లుబ్ధుడు : బోయవాడు
మాతంగుడు : మాదిగ
చండాల : మాలవాడు
ఈండ్ర : ఈడిగ వారు (ఈండ్ర అంటే తాటి చెట్టును గీచి జీవించే వారు అని అర్థం. ఈండ్రము అంటే పీడనం, ఈండ్రించడం అంటే పీడించడం అని కూడా అర్థం ఉంది. అంటే వీరు పీడించే వారు అని దురర్థానికి రాకండి)
కసాయి : కటిక వాడు (కటిక అంటే మాంసం అమ్మేవాడు అని అర్థం. పొరపాటున కటికి అని రాసేరు.. కటికి అంటే ఎక్కువ, కఠినం అనిఅర్థం. కటికి చీకటి అంటే ఎక్కువ చీకటి లేదా చిక్కటి చీకటి అని అర్థం)
అంతవసాయి అంటే మంగలి, మాల అన్న అర్థాలూ ఉన్నాయి.
జాతి అంటే..
కులము, పుట్టుక, సామాన్యం, అర్థాలంకారం, పద్యభేదం, పొయ్యి, జాజికాయ అని అర్థాలున్నాయి.
పురుష జాతులు నాలుగట.
(1) భద్రుడు,
(2) దత్తుడు
(3) కూచిమారుడు
(4) పాంచాలుడు
స్త్రీ జాతులు కూడా నాలుగేనట.
(1) పద్మిని
(2) హస్తిని
(3) శంఖిని
(4) చిత్రిణి
జాతకుడు అంటే పుట్టినవాడు,
జాతము అంటే సమూహం
జాతవేదుడు అంటే అగ్నిదేవుడు
జాతాపత్య అంటే బాలింత అన్న అర్థాలూ ఉన్నాయి.
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలని చాతుర్వర్ణాలని అంటారు. వాటి అర్థాలను పరిశీలిస్తే..
(1) బ్రహ్మ : బ్రాహ్మణుడు, పరమాత్మ
(2) క్షత్రియ : రాచవాడు, రాజు
(3) వైశ్య : కోమటివాడు, ఆర్యుడు
(4) శూద్రుడు : 4వ జాతి వాడు
శూద్రుడు అంటే 4వ జాతి వాడు అన్నారు. మరి అందులోకి ఎవరెవరు వస్తారు..?
వ్యావహారికుడు : మంత్రి
గోరక్షక : ఆవులు కాసేవాడు
శిల్పక : శిల్పి. ( ఈ శిల్పి శిలలను చెక్కే వాడు కాదు. ఈ కోవలో ఏడుగురు శిల్పులు ఉన్నారు. వారు.... వడ్లంగి, సాలె, మంగలి, చాకలి, ముచ్చి. (ముచ్చి అంటే చిత్రకారుడు)
పంచాణ : శిల్పి (శిలలను శిల్పాలుగా మలిచేవాడు)
కుంభకార : కులాలుడు, కుమ్మరి
తంతువాయి : సాలెవాడు (తంతునాభము అన్నా తంతువాయము అన్నా సాలెపురుగు అని అర్థం. తంతువాయము నుంచి తంతువాయి వచ్చింది.)
క్షౌరక : మంగలి
రజక : చాకలి
వస్త్రఛేదక : దుస్తులు కత్తిరించే వాడు (దర్జీ)
చర్మకార : మాదిగ
తిలఘాత : గాండ్లవాడు (తిలలు అంటు నువ్వులు ఘాత అంటే నలిపడం అని అర్థం. నువ్వుల్ని నలిపి నూనె తీసే వృత్తి వారు గాండ్లవారు)
లుబ్ధుడు : బోయవాడు
మాతంగుడు : మాదిగ
చండాల : మాలవాడు
ఈండ్ర : ఈడిగ వారు (ఈండ్ర అంటే తాటి చెట్టును గీచి జీవించే వారు అని అర్థం. ఈండ్రము అంటే పీడనం, ఈండ్రించడం అంటే పీడించడం అని కూడా అర్థం ఉంది. అంటే వీరు పీడించే వారు అని దురర్థానికి రాకండి)
కసాయి : కటిక వాడు (కటిక అంటే మాంసం అమ్మేవాడు అని అర్థం. పొరపాటున కటికి అని రాసేరు.. కటికి అంటే ఎక్కువ, కఠినం అనిఅర్థం. కటికి చీకటి అంటే ఎక్కువ చీకటి లేదా చిక్కటి చీకటి అని అర్థం)
అంతవసాయి అంటే మంగలి, మాల అన్న అర్థాలూ ఉన్నాయి.
జర్నలిస్టు మిత్రులారా, ఇదిగో తప్పొప్పుల పట్టిక..
జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల్లో అచ్చుతప్పులు ఎక్కువగా దొర్లుతున్నాయి. ఫలితంగా.. చాలా సార్లు దురర్థం వస్తోంది. ( ఉదాహరణకు పుణ్యాంగన అంటే పవిత్రమైన స్త్రీ అని అర్థం. ఐతే, పొరపాటున పణ్యాంగన అని రాస్తే వెలయాలు, వేశ్య అని అర్థం వస్తుంది) అందుకే ఇలాంటి దారుణాలు జరగకూడదన్న సదాశయంతో.. జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల అసలు స్వరూపాలను (వాటి తప్పు రూపాలతో సహా) ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది జర్నలిస్టు మిత్రులందరికీ ఉపయోగపడుతుందని.. ఉపయోగపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి పదాల స్వరూపాలతోనే ముగిద్దాం. తర్వాతి పోస్టులో వీటి అర్థాలు.. వినియోగించే సందర్భాల గురించి చర్చిద్దాం. ( www.journomucchatlu.blogspot.com అనే url తో ఎప్పుడైనా సరే మీరు పదాలను సరిపోల్చుకునేందుకు నా ఈ ప్రయత్నం ఉపయోగ పడుతుందని నమ్ముతున్నాను) మీ... విజయ్ | |||
తప్పు | ఒప్పు | తప్పు | ఒప్పు |
ఆగచాట్లు | అగచాట్లు | ఆగత్యం | అగత్యం |
అట్టాహాసం | అట్టహాసం | అదిగమించు | అధిగమించు |
అధ్యాయనం | అధ్యయనం | అనర్దదాయకం | అనర్థదాయకం |
అనుభందం | అనుబంధం | అనుసంథానం | అనుసంధానం |
అంధలం | అందలం | అపరాథం | అపరాధం |
అపబ్రంశం | అపభ్రంశం | అపొహ | అపోహ |
అప్పానంగా | అప్పనంగా | అభద్దం | అబద్ధం |
అబినందన | అభినందన | అబిమానం | అభిమానం |
అబియోగం | అభియోగం | అబ్యంతరం | అభ్యంతరం |
అబ్యర్తి | అభ్యర్థి | అభ్యుధయం | అభ్యుదయం |
అమాత్యిడు | అమాత్యుడు | అమంతంగా | అమాంతంగా |
అయోమైయంగా | అయోమయంగా | అరాచకం | అరాజకం |
అలంకారించు | అలంకరించు | అవకాతవకలు | అవకతవకలు |
ఆవగాహన | అవగాహన | ఆవశ్యం | అవశ్యం |
ఆగ్రహాం | ఆగ్రహం | ఆశనిపాతం | అశనిపాతం |
అశ్రద్ద | అశ్రద్ధ | అసబ్యంగా | అసభ్యంగా |
అగంతకుడు | ఆగంతకుడు | అస్థమానం | అస్తమానం |
అక్షేపించు | ఆక్షేపించు | అకతాయి | ఆకతాయి |
అంక్షలు | ఆంక్షలు | అణిముత్యాలు | ఆణిముత్యాలు |
ఆధరణ | ఆదరణ | ఆధర్శం | ఆదర్శం |
ఆధాయం | ఆదాయం | ఆమోధం | ఆమోదం |
ఆయుకట్టు | ఆయకట్టు | ఆరంబం | ఆరంభం |
అరిమరికలు | అరమరికలు | ఆర్బాటం | ఆర్భాటం |
ఆవరన | ఆవరణ | ఆస్రితపక్షపాతం | ఆశ్రిత పక్షపాతం |
అగ్నిమాపుకం | అగ్నిమాపకం | అత్తిసరు | అత్తెసరు |
అర్బకుడు | అర్భకుడు | అష్ఠకష్ఠాలు | అష్టకష్టాలు |
అష్ఠైశ్వర్యాలు | అష్టైశ్వర్యాలు | అస్థవ్యస్థం | అస్తవ్యస్తం |
ఆధునీకరణ | ఆధునికీకరణ | ఆనవాయతీ | ఆనవాయితీ |
ఆబాలగోపాళం | ఆబాలగోపాలం | అబివృద్ది | అభివృద్ధి |
అబిప్రాయం | అభిప్రాయం | అధికృత | అధీకృత |
అంతర్యుద్దం | అంతర్యుద్ధం | అణ్వాస్త్రం | అణ్వస్త్రం |
అధారిటీ | అథారిటీ | అనివారంగా | అనివార్యంగా |
అభ్యర్దించు | అభ్యర్థించు | అవస్త | అవస్థ |
అగాయిత్యం | అఘాయిత్యం | అత్యథికం | అత్యధికం |
అధమ | అథమ | అదిక్షేపించు | అధిక్షేపించు |
అనవతం | అవనతం | అర్ధంతరంగా | అర్ధాంతరంగా |
అణుకువ | అణకువ | అతిధి | అతిథి |
అధిష్టానం | అధిష్ఠానం | అగాథం | అగాధం |
అద్వాన్నం | అధ్వానం | అప్రతిష్ట | అప్రతిష్ఠ |
అరిష్ఠం | అరిష్టం | అవ్యజ | అవ్యాజ |
అంతర్థానం | అంతర్ధానం | అతిరధుడు | అతిరథుడు |
అనర్ధం | అనర్థం | అతివృష్ఠి | అతివృష్టి |
అనుసంథానం | అనుసంధానం | అర్జి | అర్జీ |
ఆక్రమం | అక్రమం | అక్షంతలు | అక్షింతలు |
అగ్రస్తానం | అగ్రస్థానం | అజమాయషీ | అజమాయిషీ |
అత్తలాకుత్తలం | అతలాకుతలం | రంగరంగవైభవం | అంగరంగ వైభవం |
అడ్డాదిడ్డం | అడ్డదిడ్డంగా | అదృస్యం | అదృశ్యం |
అధీగమించు | అధిగమించు | అద్యక్షుడు | అధ్యక్షుడు |
అనుచెరుడు | అనుచరుడు | అనుచిత్తంగా | అనుచితంగా |
అనుసందానం | అనుసంధానం | ఆహుతులు | ఆహూతులు |
ఆక్షేపన | ఆక్షేపణ | ఆచ్చాదన | ఆచ్ఛాదన |
అతిథ్యం | ఆతిథ్యం | ఆస్థులు | ఆస్తులు |
ఆస్థిపాస్థులు | ఆస్తిపాస్తులు | ఆర్దిక | ఆర్థిక |
ఆంద్రుడు | ఆంధ్రుడు | అల్పఫీడనం | అల్పపీడనం |
ఇంగీతం | ఇంగితం | ఇథోదికంగా | ఇతోధికంగా |
ఇబ్భంది | ఇబ్బంది | ఇబ్బుడిముబ్బుడి | ఇబ్బడిముబ్బడి |
ఇనస్పెక్టర్ | ఇన్స్పెక్టర్ | ఇల్లరికటం | ఇల్లరికం |
ఈర్ష | ఈర్ష్య | ఈసుడింపు | ఈసడింపు |
ఉద్గాటించారు | ఉద్ఘాటించారు | వుత్తమం | ఉత్తమం |
ఉల్లంగించారు | ఉల్లంఘించారు | ఉచ్ఛారణ | ఉచ్చారణ |
ఉపోద్గాతం | ఉపోద్ఘాతం | ఉన్నపలంగా | ఉన్నపళంగా |
ఉపాద్యక్షుడు | ఉపాధ్యక్షుడు | ఉత్తానపతనాలు | ఉత్థానపతనాలు |
గుండ్రాళ్లదెబ్బ | ఉండేలు దెబ్బ | వుచితంగా | ఉచితంగా |
ఉద్బవించారు | ఉద్భవించారు | ఉత్ఫాథం | ఉత్పాతం |
ఉఢాయించారు | ఉడాయించారు | ఉదాశీనత | ఉదాసీనత |
ఉత్సావం | ఉత్సవం | ఉధ్యమం | ఉద్యమం |
ఉదాహారణ | ఉదాహరణ | ఉధ్వాసన | ఉద్వాసన |
ఉద్భోదించారు | ఉద్బోధించారు | ఉపాచారం | ఉపచారం |
ఉపగృహం | ఉపగ్రహం | ఉపయోగ్యం | ఉపయోగం |
ఉపదేశ్యం | ఉపదేశం | ఉప సంహారణ | ఉపసంహరణ |
ఉపాది | ఉపాధి | ఉవ్విల్లూరు | ఉవ్విళ్లూరు |
ఊరుమ్ముడి | ఊరుమ్మడి | ఎడతెరుపి | ఎడతెరిపి |
ఏకాఎకిన | ఎకాఎకిన | ఎద్ధడి | ఎద్దడి |
ఎన్నైక | ఎన్నిక, ఎంపిక | ఏన్నర్థంగా | ఏణ్ణర్థంగా |
ఏమరుపాటిగా | ఏమరుపాటుగా | ఐచ్చిక | ఐచ్ఛిక |
ఏకంతంలో | ఏకాంతంలో | ఐక్యమత్యం | ఐకమత్యం |
ఐఖ్యం | ఐక్యం | ఔఛిత్యం | ఔచిత్యం |
ఒడంభడిక | ఒడంబడిక | కధ | కథ |
కనిష్ఠం | కనిష్టం | కౌన్సిలింగ్ | కౌన్సెలింగ్ |
కటాకట | కటకట | ఖచ్చితంగా | కచ్చితంగా |
కలక్టరేట్ | కలెక్టరేట్ | క్రోదం | క్రోధం |
కమీశనర్ | కమిషనర్ | క్రమబద్దీకరణ | క్రమబద్ధీకరణ |
కూలంకశంగా | కూలంకషంగా | ఖంగారు | కంగారు |
కలువరింత | కలవరింత | కాపురస్తులు | కాపురస్థులు |
కల్లోళం | కల్లోలం | కాలుశ్యం | కాలుష్యం |
కార్యదర్సి | కార్యదర్శి | కూలంఖషంగా | కూలంకషంగా |
కీర్తిసేషులు | కీర్తిశేషులు | కాయిలా | ఖాయిలా |
క్రీఢాకారులు | క్రీడాకారులు | ఖచ్చితంగా | కచ్చితంగా |
కాకీ | ఖాకీ | గాతం | ఘాతం |
గర్బం | గర్భం | గాయికుడు | గాయకుడు |
గాయిని | గాయని | గ్రంధసాంగుడు | గ్రంథసాంగుడు |
గ్రంధం | గ్రంథం | గుభాళింపు | గుబాళింపు |
గుత్తాదిపత్యం | గుత్తాధిపత్యం | గృహస్తుడు | గృహస్థుడు |
గూడాచారి | గూఢచారి | గడిబిడ | గడబిడ |
గౌరవార్ధం | గౌరవార్థం | గంబీరంగా | గంభీరంగా |
గమినించు | గమనించు | గుభులు | గుబులు |
గరానా | ఘరానా | చతుర్ది | చతుర్థి |
ఛట్టబద్దం | చట్టబద్ధం | చిరనామ | చిరునామా |
చతుష్ఠయం | చతుష్టయం | చేతన్యం | చైతన్యం |
చాంపియన్ | ఛాంపియన్ | జయంత్యోత్సవం | జయంత్యుత్సవం |
జనార్ధన | జనార్దన | జీవచ్చవం | జీవచ్ఛవం |
జీర్ణుద్ధరణ | జీర్ణోద్ధరణ | జళిపించు | ఝళిపించు |
జఠిలం | జటిలం | ఢీలాపడు | డీలా పడు |
డెప్యూటీ | డిప్యూటీ | డైరక్టరేట్ | డైరెక్టరేట్ |
డ్రయినేజీ | డ్రైనేజీ | ఢక్కామక్కీలు | డక్కామొక్కీలు |
డిశంబర్ | డిసెంబర్ | డయిరీ | డెయిరీ |
డమరుకం | ఢమరుకం | తలుకుబెలుకు | తళుకుబెళుకు |
తనికీ | తనిఖీ | తాలుకా | తాలూకా |
తాదాత్మం | తాదాత్మ్యం | తటస్తం | తటస్థం |
తాకత్తు | తాహతు | తలక్రిందులు | తల్లకిందులు |
త్రైపక్షిక | త్రైపాక్షిక | తిరోగామం | తిరోగమనం |
తలవొంపులు | తలవంపులు | తృటి | త్రుటి |
తిరస్కారించు | తిరస్కరించు | దగ్దం | దగ్ధం |
తీర్ధం | తీర్థం | ద్వందవైఖరి | ద్వంద్వ వైఖరి |
ధృడం | దృఢం | దుష్పలితం | దుష్ఫలితం |
దరకాస్తు | దరఖాస్తు | దృక్ఫదం | దృక్పథం |
ధీటుగా | దీటుగా | దిగ్భందం | దిగ్బంధం |
దౌర్బాగ్యం | దౌర్భాగ్యం | ధండకం | దండకం |
దిగ్బ్రాంతి | దిగ్భ్రాంతి | దాఖలు | దఖలు |
దైర్యం | ధైర్యం | దగ్దం | దగ్ధం |
దంఢయాత్ర | దండయాత్ర | దుర్ధినం | దుర్దినం |
దహానం | దహనం | దర్మాసనం | ధర్మాసనం |
దషకం | దశకం | దిక్కరించు | ధిక్కరించు |
దోహధపడు | దోహదపడు | ద్యేయం | ధ్యేయం |
దాటి | ధాటి | దృవీకరించు | ధ్రువీకరించు |
ధురందరుడు | దురంధరుడు | దుర్బేధ్యం | దుర్భేద్యం |
దరలు | ధరలు | నిర్ద్వందంగా | నిర్ద్వంద్వంగా |
దూమపానం | ధూమపానం | నిర్ధారణ | నిర్ధరణ |
నిముషం | నిమిషం | నిషేదిత | నిషేధిత |
నిర్భందం | నిర్బంధం | నిసృహ | నిస్పృహ |
నిశ్చితార్ధం | నిశ్చితార్థం | నిర్ధిష్టంగా | నిర్దిష్టంగా |
నిశేదాజ్ఞలు | నిషేధాజ్ఞలు | నెంబరు | నంబరు |
నేరస్తులు | నేరస్థులు | నిర్ధయ | నిర్దయగా |
నేపద్యం | నేపథ్యం | న్యాయస్తానం | న్యాయస్థానం |
నిరూపయోగం | నిరుపయోగం | నసించు | నశించు |
నిర్ధాక్షిణ్యం | నిర్దాక్షిణ్యం | నిక్కచ్ఛిగా | నిక్కచ్చిగా |
నదీనదులు | నదీనదాలు | నిమత్తం | నిమిత్తం |
నాస్థికుడు | నాస్తికుడు | నిరాయుదీకరణ | నిరాయుధీకరణ |
నిఘ్రహం | నిగ్రహం | నివృతి | నివృత్తి |
నిరాఠంకంగా | నిరాటంకంగా | నిర్భందం | నిర్బంధం |
నిరాహార ధీక్ష | నిరాహార దీక్ష | నిర్వీరం | నిర్వీర్యం |
నిర్ధేశ్యం | నిర్దేశం | నిష్క్రమింఛారు | నిష్క్రమించారు. |
నిర్వాఖం | నిర్వాకం | నైవేధ్యం | నైవేద్యం |
నివేధిక | నివేదిక | ప్రధమ | ప్రథమ |
నీరషించు | నీరసించు | పట్టబద్రులు | పట్టభద్రులు |
ప్రత్యామ్నం | ప్రత్యామ్నాయం | పుంకానుపుంకాలు | పుంఖానుపుంఖాలు |
పంఛాయతీ | పంచాయితీ | పునర్వవస్తీకరణ | పునర్వ్యవస్థీకరణ |
పటిష్ఠం | పటిష్టం | ప్రయివేటు | ప్రైవేటు |
పునరుద్గాటించు | పునరుద్ఘాటించు | పశుసంవర్దక | పశుసంవర్ధక |
ప్రాధమిక | ప్రాథమిక | ప్రాదేయపడు | ప్రాధేయపడు |
పరిణామ్యం | పరిణామం | పరివాహక | పరీవాహక |
పురష్కారం | పురస్కారం | పర్యావసానం | పర్యవసానం |
పరిక్ష | పరీక్ష | ప్రణాలిక | ప్రణాళిక |
పరోపంగా | పరోక్షంగా | పించెను | పింఛను |
పలయానం | పలాయనం | ఫుకారు | వదంతి |
పల్లెత్తమాట | పల్లెత్తుమాట | పరంబోకు | పోరంబోకు |
పీపాస | పిపాస | ప్రచ్చనం | ప్రచ్ఛన్నం |
పూర్వత్తరాలు | పూర్వోత్తరాలు | ప్రతిబ | ప్రతిభ |
ప్రక్షాలనం | ప్రక్షాళనం | ప్రతిక | ప్రతీక |
ప్రతిష్ట | ప్రతిష్ఠ | ప్రబాతం | ప్రభాతం |
ప్రత్యర్ధి | ప్రత్యర్థి | ప్రలోబం | ప్రలోభం |
ప్రబంజనం | ప్రభంజనం | ప్రశక్తి | ప్రసక్తి |
ప్రమానం | ప్రమాణం | ప్రాంగనం | ప్రాంగణం |
ప్రవాశం | ప్రవాసం | భాద్యత | బాధ్యత |
పందారం | పందేరం | భీభత్సం | బీభత్సం |
బాహబాహి | బాహాబాహీ | భహిరంగంగా | బహిరంగంగా |
భుద్ది | బుద్ధి | బ్రహ్మరధం | బ్రహ్మరథం |
భడుగు | బడుగు | బీష్మించు | భీష్మించు |
బృంధావనం | బృందావనం | బౌతిక | భౌతిక |
బవిత | భవిత | భ్రష్ఠుడు | భ్రష్టుడు |
బేషజం | భేషజం | మర్థించు | మర్దించు |
బాగస్తులు | భాగస్థులు | మద్యాన్నం | మధ్యాహ్నం |
భూస్తాపితం | భూస్థాపితం | మనస్థాపం | మనస్తాపం |
మధ్యపానం | మద్యపానం | మలేషియా | మలేసియా |
మదువు | మధువు | మెలకువ | మెళకువ |
మరమత్తు | మరమ్మతు | మార్చ్ | మార్చి |
మార్ధవం | మార్దవం | మితృడు | మిత్రుడు |
మహాత్యం | మహాత్మ్యం | మమైకం | మమేకం |
మథలబు | మతలబు | యధాతధం | యథాతథం |
మనోనిబ్భరం | మనోనిబ్బరం | యుద్దం | యుద్ధం |
యధార్థం | యథార్థం | యదేచ్ఛగా | యధేచ్చగా |
యాదృచ్చికం | యాదృచ్ఛికం | రబస | రభస |
యవ్వనం | యౌవనం | రంగేళిరాట్నం | రంగులరాట్నం |
రధం | రథం | రొచ్ఛు | రొచ్చు |
రిజిష్ట్రార్ | రిజిస్ట్రార్ | రవుతు | రౌతు |
రాజదాని | రాజధాని | లాటీఛార్జి | లాఠీచార్జ్ |
రోదశి | రోదసి | లంకణం | లంఖణం |
లబ్ధిదారులు | లబ్దిదారులు | వైశమ్యం | వైషమ్యం |
లక్షం | లక్ష్యం | విద్యుద్ఘాతం | విద్యుదాఘాతం |
వ్యర్ధం | వ్యర్థం | వార్శికం | వార్షికం |
వ్యాహ్యాళి | వాహ్యాళి | విఛక్షణ | విచక్షణ |
విమర్ష | విమర్శ | వ్యక్తిగథం | వ్యక్తిగతం |
వినోధం | వినోదం | వేధిక | వేదిక |
విరాలం | విరాళం | వెవహారం | వ్యవహారం |
విస్పోటన | విస్ఫోటన | వ్యాఫారి | వ్యాపారి |
వెవసాయం | వ్యవసాయం | శబ్ధం | శబ్దం |
వ్యాక్యానం | వ్యాఖ్యానం | షాశనం | శాసనం |
వాయగండం | వాయుగుండం | స్మశానం | శ్మశానం |
శతగ్ని | శతఘ్ని | శికారు | షికారు |
షాతం | శాతం | సమర్ధించడం | సమర్థించడం |
శోదన | శోధన | సంభోదన | సంబోధన |
శృతి | శ్రుతి | సషేశం | సశేషం |
సధస్సు | సదస్సు | సమృద్ది | సమృద్ధి |
స్తోమత | స్థోమత | సారధి | సారథి |
సంషయం | సంశయం | స్తలం | స్థలం |
సంగటం | సంకటం | సంస్త | సంస్థ |
సదుద్ధేశ్యం | సదుద్దేశం | సృహలో | స్పృహలో |
స్తిరం | స్థిరం | సఛివులు | సచివులు |
స్వచ్చందంగా | స్వచ్ఛందంగా | సందర్బం | సందర్భం |
స్తితిగతులు | స్థితిగతులు | సమీకరనాలు | సమీకరణాలు |
సంజాయషీ | సంజాయిషీ | సంస్తాగతం | సంస్థాగతం |
సంథరించు | సంతరించు | సమిక్ష | సమీక్ష |
సబ్యుడు | సభ్యుడు | సహాకారం | సహకారం |
సమర్ధన | సమర్థన | సౌష్టవం | సౌష్ఠవం |
సమిష్టి | సమష్టి | స్తాయి | స్థాయి |
సవరన | సవరణ | స్తూలంగా | స్థూలంగా |
సవుజన్యం | సౌజన్యం | స్ఫందన | స్పందన |
స్తావరం | స్థావరం | హేమాహేమిలు | హేమాహేమీలు |
స్నాతకుత్సవం | స్నాతకోత్సవం | హుటాహుటన | హుటాహుటిన |
స్వానుబవం | స్వానుభవం | క్షిఫణి | క్షిపణి |
హటాత్తుగా | హఠాత్తుగా | హడావిడి | హడావుడి |
Subscribe to:
Posts (Atom)