చాలా విషయాలు ఇక్కడ చర్చించాలని ఉంది.. బ్లాగ్ ఓపెన్ చేయగానే ఎన్నెన్నో రాయాలని ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెడదాం అని ఆలోచన మొదలు కాగానే.. ఎమ్మిగనూరు నుంచి హైదరాబాద్ దాకా సాగిన 22 ఏళ్ల వృత్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు గుర్తుకొచ్చేవి. దీంతో.. ఏ అంశంతో మొదలు పెట్టాలో తేల్చుకోలేక.. సతమతమై.. గజిబిజి పడి.. ఏమీ రాయకుండానే బ్లాగ్ ని అర్ధంతరంగా మూసేసి.. ఇతర పనుల్లో పడిపోయేవాడిని. నల్లమలలో దారితప్పిన వ్యాసం రాశాక.. ఇప్పటి వరకూ దాదాపు ప్రతి రోజూ ఇదే తంతు.
ఇక లాభం లేదనుకొని.. నాకు మనసులో తట్టిన ప్రతి భావాన్నీ ఇక్కడ అక్షరబద్ధం చేయాలన్ని నిర్ణయానికి వచ్చి.. పోస్ట్ రాయడం మొదలు పెడుతున్నా.
ఈ పోస్ట్ ద్వారా నేను, నా ప్రియమిత్రుల్లో ఒకడైన సురావఝల రాముకు అనేకానేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే, నా నల్లమల సాహస యాత్ర గురించిన వ్యాసాన్ని తను, తన apmediakaburlu.blogspot.com లో పోస్ట్ చేసి.. నాకు విపరీతమైన పబ్లిసిటీ తెచ్చి పెట్టాడు. కొత్తవాళ్లు స్నేహితులవడం మాటేమో గానీ.. రామూ గాడి పుణ్యమా అని.. ఏళ్ల కింద మిస్ అయిపోయిన స్నేహ సంబంధాలు మళ్లీ చిగురించాయి.
నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని తోట భావనారాయణ.. తనే ఫోన్ చేసి (వ్యక్తిగత పనుల కోసం బళ్లారిలో ఉన్నప్పుడు) బ్లాగ్ బాగోగుల గురించి మాట్లాడి రచన కొనసాగించమని సూచించారు..),నేను అనంతపురం జిల్లాలో ఈటీవీ సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నపుడు.. ఈనాడు జర్నలిజం క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా నావద్ద కొన్ని రోజులు శిక్షణ పొందిన అరుణ (తను ఎక్కడుందీ చెప్పలేదు అయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నట్లు మిత్రులు చెప్పారు), భార్గవి (సాక్షి).. అక్కడే ఈనాడులో కర్ణాటక డెస్క్ ఇంఛార్జిగా పనిచేసి.. తర్వాత మహబూబ్ నగర్ బదిలీ అయి వెళ్లిపోయిన డబీర్ రాజేంద్రప్రసాద్, (ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని.. వీలున్నప్పుడు కలుద్దామని నా ఫోన్ నంబరు సాధించి ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు) ఈనాడు జర్నలిజం స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకోగానే చెన్నై స్టాఫ్ రిపోర్టర్ గా వెళ్లినపుడు అక్కడ అప్పటి తమిళనాడు డెస్క్ ఇంఛార్జి నాగేందర్ (తనూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ప్రజాశక్తిలో ఉన్నానని.. అలనాటి స్మృతులను అందంగా గుర్తు చేశారు) బిఎస్ (అదేనండి ఈటీవీ నేరాలు-ఘోరాలు ఫేమ్.. శ్రీనివాస్, నా ఫోన్ స్విచాఫ్ అయివుంటే అన్నా ఫోన్ చేయ్.. అంటూ మెసేజ్ పెట్టి మరీ నాతో మైత్రీ బంధాన్ని పునరుద్ధరించుకున్నాడు..తనిప్పుడు మహాటీవీలో ఉన్నాడు) సాక్షిలో ఉన్న ప్రభాకర్..(నెల్లూరు లో ఒకప్పటి ఈటీవీ కెమెరా స్ట్రింగర్.. ప్రస్తుతం సాక్షిలో మంచి కాపీ ఎడిటర్..) ఇలా ఒకరేమిటి..? ఎందరో ఆత్మీయులు మళ్లీ నాకు టచ్ లోకి వచ్చారు.
మరి నాకింత మంచి చేసిన రామూ గాడికి (గాడు, వీడు లాంటి పదాలు వాడడం బ్లాగ్ మర్యాద కాదంటారా..? ఏమో! అయినా ఇది నా స్వగతం.. మావోణ్ణి ఏరా ఒరేయ్ అనుకునే హక్కు నాకుండదా ఏంటండీ.. మీ దృష్టిలో తప్పయితే సారీ..) ధన్యవాదాలు చెప్పకుంటే ఎలా..?
రేయ్ రామూ @ apmediakaburlu.blogspot.com , నీకు మెనీ మెనీ థ్యాంక్స్ రా. నువ్వు మన మిత్రులందరికీ వారధివిరా.. అందుకే లాంగ్ లివ్ మై ఫ్రెండ్.
ఇప్పటికి ఈ ఆర్టికల్ ఇంతటితో సమాప్తం. మంచి ఊపొచ్చింది.. వెన్వెంటనే మరిన్ని పోస్ట్ లు రాసి వేస్తా.. ఈసారి జాగు చేయబోను. ప్రామిస్.
ప్రియ మిత్రుడి పైన అభిమానాన్ని, ఆత్మీయతను చాటుకోవడానికి గాడు, గీడు, అరె, ఒరే లాంటి పదాలను వాడడం తెలుగు భాష మీద మీకు మంచి పట్టు లేదన్న విషయాన్ని తెలియపరుస్తోంది. భాషా ప్రయోగం, పదజాల అభివృద్ధి వంటి విషయాలలో కొంచెం శ్రమ పెడితే, మీ వృత్తిపరమైన విజయాలకు అది బాగా దోహద పడుతుంది.
ReplyDeleteవిమర్శలను సదుద్దేశంతో స్వీకరిస్తారని ఆశిస్తూ...
Nijamaina premabhimanalaku aa pilupu asalina chihnam annadhi na uddhesam..vijay sir aa pilupulo entha matharam yhappu ledu sir
ReplyDeletePRABHAKAR_NLR