Monday, August 25, 2014

దేశ సరిహద్దుల్లో భద్రత పదిలమేనా..?


రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయులు
() ఈ తెల్లవారుఝామున చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీసులు 33 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళంతా.. ఆ దేశం నుంచి ఎలాంటి పాస్ పోర్టులూ లేకుండా భారత్ లోకి ప్రవేశించారన్నది అభియోగం. తాము ఉపాధి కోసం బెంగళూరు వెళుతున్నట్లు పోలీసుల అదుపులోని నిందితులు చెప్పారు. అయితే.. ఇక్కడ ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికీ గురి చేసే అంశం ఏంటంటే.. వీళ్ళు  గడచిన మూడేళ్ళుగా.. ఇదే తీరున ఎలాంటి పాస్ పోర్టులూ లేకుండా బెంగళూరుకి వచ్చి వెళుతున్నారట. ఔరా..!

ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్రీలంకవాసులు
() ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం శివారు ప్రాంతంలోని ఓ ఇంట్లో.. పదిమంది శ్రీలంక వాసులు అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకోబోతుంటే.. పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసు బృందం  ఛేజ్ చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరు శ్రీలంక వాసులేనా..? సూరారెడ్డిపాలెంలో రహస్యంగా.. గ్రామస్థులతో ఏమాత్రం మాట్లాడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు గడుపుతున్నారు..? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నాకు ఇప్పుడు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి..

() మన దేశ సరిహద్దుల్లో భద్రత నిజంగానే పటిష్ఠంగా ఉందా..?

() బంగ్లాడేశ్ కి చెందిన ఒక కుటుంబం మూడేళ్ళుగా యధేచ్ఛగా మన దేశంలోకి ఉపాధి కోసం వచ్చివెళుతున్నట్లే.. తీవ్రవాదులు కూడా ఎందుకు ప్రవేశించి ఉండరు..?

() చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆమధ్య  తీవ్రవాదుల ఆచూకీ  కలకలం రేపినట్టే.. తాజాగా మరికొందరు  తీవ్రవాదులు  మన రాష్ట్రంలోని పల్లెల్లో  గుట్టుగా ఉంటూ..  ఏవైనా విధ్వంసాలకు రూపకల్పన చేశారా..?

() వచ్చే పండుగ దినాల్లో మనం సురక్షితంగా ఉండొచ్చా..?


చూద్దాం..!! వచ్చే రోజుల్లో ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగు చూస్తాయో.. ఏమో!!!

No comments:

Post a Comment