ఏడాది క్రితం..
బూరా గారి సంస్మరణ సభలో కలిశావు..
ఎన్నో స్మృతులను కలబోసుకున్నావు..
నవ్వుల పువ్వులు పూయించావు..
మధుర స్మృతులు మిగిల్చావు..
బూరా గారి శిష్యులందరికోసం
ఫేస్‌బుక్‌లో ఓ గ్రూపు సృష్టిస్తానన్నావు.
అందులో అందరూ టచ్‌లో ఉందామన్నావు..
అంతలోనే అందరాని లోకాలకు వెళ్లిపోయావు
నీకు అప్పుడే నూరేళ్లూ నిండడమేంటి..?
విధికి అంత తేలిగ్గా ఎలా లొంగావు..?
నీ పోరాట పటిమ విధిని నిలుపలేక పోయిందే..?
ఏమైనా రమణా.. నీ మరణ వార్త నాకు అశనిపాతం
ద్రవిస్తున్న నా హృదయం..
కళ్ల ద్వారా స్రవిస్తోంది..
నీ ఆత్మకు శాంతి కలగాలి
ఇదే నీ ఈ మిత్రుడి అశ్రునివాళి
- విజయ్
( ఈనాడు జర్నలిజం స్కూలు 1992 వ బ్యాచ్‌కు చెందిన మా మిత్రుడు వెంకటరమణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక.. బాధను వ్యక్తం చేసేందుకు గొంతుక పెగలక.. ఇలా తొలిసారిగా అక్షరాలను ఆశ్రయించా)
మిత్రుడు రమణ అకాల మరణం కలచివేసింది ., ఇద్దరం బిజినెస్ రిపోర్టింగ్ చేసేవాళ్ళం.. నేను షేర్ కాలం అయన ఈనాడులో చేసాం. వెరీ శ్యాడ్ న్యూస్ ... ఇంతకంటే మాటలు రావడం లేదు.
ReplyDelete