శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని
చాప్టర్ _ 8 ముఖ్యాంశాలు
రాజకీయ అంశాలు :చాప్టర్ _ 8 ముఖ్యాంశాలు
- రాజకీయ పార్టీల నాయకులందరినీ ఏక తాటిపైకి తేవడం
- తెలంగాణ నాయకులను కీలక పదవుల్లో నియమించడం
- ఉద్యమానికి మూల కారణమైన టిఆర్‌ఎస్‌ని వీలైనంతగా దువ్వటం
- తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అదుపు చేయటం. (కాంగ్రెస్ అధిష్ఠానం తమ పార్టీ నాయకులను అదుపులో ఉంచాలి)
- ఇవన్నీ చేస్తూ.. ఈ అంశంపై విస్తృత చర్చలకు సిద్ధమని కేంద్రం బహిరంగ ప్రకటన చేయాలి.
- తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య పెచ్చు మీరిపోతుంది.
- మత ఘర్షణలు కూడా పెరుగుతాయి. (అదెలాగంటే.. బిజెపి ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రాంతంలో మరింతగా పాదుకోవాలని ప్రయత్నిస్తోంది. MIM పార్టీని నిలువరించే దిశగా ఆ పార్టీ క్యాడర్ ప్రయత్నిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో మత ఘర్షణలకు తావిస్తుంది)
- హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి సమృద్ధిగా ఉంది. చాలా ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఈ రాష్ట్రంలో జిడిపి (తలసరి ఆదాయం) ఎక్కువగానే ఉంది.
- తెలంగాణలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, పత్రికలు, మీడియా అత్యధికం సీమాంధ్ర ప్రాంత యాజమాన్యాల చేతుల్లోనే ఉన్నాయి.
- ఈ సంస్థల్లోని కీలక స్థానాల్లో కూడా సీమాంధ్ర ప్రాంత వాసులే ఉన్నారు.
- రాష్ట్రంలో 13 టివి ఛానళ్లు, 5 ప్రధాన వార్తా పత్రికలు ఉన్నాయి.
- రాజ్ న్యూస్, హెచ్ఎంటీవీ తప్ప మిగిలిన అన్ని ఛానళ్లు సమైక్యాంధ్రనే సమర్థిస్తున్నాయి.
- పత్రికాధిపతులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
- ఆంధ్ర జ్యోతి ఎడిటర్ తప్ప మిగిలిన సంపాదకులందరూ సీమాంధ్రకు మద్దతుదారులు.
- హైదరాబాద్‌లోని జర్నలిస్టుల్లో ఎక్కువ మంది ప్రత్యేక తెలంగాణ కావాలనుకుంటున్నారు. వారిలో అత్యధికులు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల ఆందోళనలను, ఆత్మహత్యలను ఎక్కువ చేసి చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో అలాంటివాటికి కొందరు రిపోర్టర్లే ప్రేరేపిస్తున్నారు.
- వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని.. ఎక్కువ చేసి చూపవద్దని మీడియాకు సూచించాలి.
- (ఉస్మానియా, కాకతీయ, క్రిష్ణదేవరాయ వర్శిటీల్లో ) పూర్తి సాయుధ బలగాలను దించాలి. విధ్వంసాలను తగ్గించాలి.
- మూడు ప్రాంతాల్లోని విధ్వంసకర శక్తులను గుర్తించి వారిని అదుపు చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక రచించాలి.
- అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కారం సాధించాలి.
- వాదాలు వినిపించే వారి వాదనలు సావధానంగా వినాలి.
- పదవుల కోసం తహతహలాడే వారిని సంతృప్తి పరచాలి. ఇది చిన్నా చితకా స్థాయిలో ఉండరాదు... ఎక్కువ మూల్యం చెల్లించేదిగా ఐనా ఉండొచ్చు.
విజయ్ గారు,
ReplyDeleteచాలా రోజుల తర్వాత పునర్దర్శనం. ఎలా ఉన్నారు. పోస్ట్ బాగుంది.
మొత్తానికి శ్రీకృష్ణ కమీషన్ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదు.
ఈ సమస్య త్వరగా పరిష్కారమైతే బాగుండు.
~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.com